హైలెవల్ బ్రిడ్జి పనులు పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి: మాజీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం
చినగుంటపల్లి,అంకూరు మధ్య నిర్మాణంలో ఉన్న హైలెవల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీళ్ళు అందుబాటులోకి వచ్చినాయని అందుకు అనుగుణంగా నీళ్ళ సరఫరా మరియు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి నియోజకవర్గంలో అనేక హైలెవల్ బ్రిడ్జిలను నిర్మించడం జరిగింది.అందులో కొన్ని పూర్తి అయినాయి కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి వాటిని వేగంగా పూర్తి చేయుటకు కాంట్రాక్టర్లు కృషి చేయాలని అధికారులు అందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలిశ్వర్ రెడ్డి,పురేందర్,చిట్యాల.రాము ఉన్నారు. (Story : హైలెవల్ బ్రిడ్జి పనులు పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

