చంద్రబాబుకు జగన్‌కు తేడాను చాటి చెప్పిన కేంద్ర బడ్జెట్
ఊసరవెల్లులు సైతం సిగ్గుపడేలా జగన్ రెడ్డి వ్యవహార శైలి
బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యంపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హర్షం
న్యూస్‌తెలుగు/ వినుకొండ :ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మధ్య తేడా ఏంటో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా చాటి చెప్పాయని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. సమర్థుడి చేతుల్లో రాష్ట్రం ఉంటే ఎలా ఉంటుంది? జగన్ లాంటి అసమర్థుల వల్ల ఎంత నష్టం, కష్టమో కూడా బడ్జెట్ చెప్పిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడంపై అవాకులు, చవాకులు పేలిన వారికి ఈ కేటాయింపులు చెంపపెట్టులాంటి సమాధానం కూడా ఇచ్చాయన్నారు జీవీ ఆంజనేయులు. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్ర రాజధాని అమరావతికి రూ. 15వేల కోట్ల ఆర్థికసాయం ప్రకటన, భవిష్యత్‌లోనూ అవసరం మేర అదనపు నిధులు ఇస్తామన్న హామీపై మంగళవారం విడుదల చేసిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు . మోదీ ప్రభుత్వం 3.0 ప్రవేశ పెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లోనే ఏపీని ప్రత్యేక చూడడం కేంద్రంలో రాష్ట్రానికి పెరిగిన ప్రాధాన్యం, చంద్రబాబు నాయత్వానికి తార్కాణంగా పేర్కొన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అన్నివిధాల సహకరిస్తామనడం ఎంతో విశ్వాసం ఇచ్చిందని, తిరిగి రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయన్న నమ్మకం కలుగుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు రెండుసార్లు దిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు చేయడం, తెలుగుదేశం పార్టీ ఎంపీలకు శాఖల వారీగా దిల్లీలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించ డం కూడా కలిసి వచ్చిందన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రాలకు ఆర్థికసాయం ఎంతో ఉపయోగడనున్నాయని తెలిపారు. అయిదేళ్లు అధికారంలో వెలగబెట్టిన వైకాపా హయాంలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు చూశామని, మనకు న్యాయంగా రావాల్సిన వాటిని కూడా సాధించుకోలేని అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. 20సార్లకు పైగా దిల్లీకి వెళ్లి కేసుల గురించి వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకోవడం తప్పితే ఏనాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించని జగన్‌కు, అతడి పార్టీకి ప్రస్తుతం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రయోజనాల గురించి అర్థమయ్యే అవకాశం కూడా లేదని చురకలు వేశారు. ఊసరవెల్లులు సైతం సిగ్గుపడే స్థాయిలో రోజుకో రంగు మార్చుతూ, పూటకోవేషం వేస్తోన్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు ఇలానే వీధివీధిలో వీరాంగాలు వేసి, ఆనక దిల్లీలో జగన్ పెట్టిన పొర్లు దండాలను ఇంకా ఎవరు మర్చిపోలేదని ఎద్దేవా చేశారాయన. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఏరోజైనా కేసులు, కాంట్రాక్టులు తప్ప రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారా అంటూ వైకాపాకు, ఆ పార్టీ అధినేత జగన్ సూటి ప్రశ్నలు సంధించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందనడానికి జగన్ మాటలు అతికినట్లు సరి పోతాయని జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. (Story : చంద్రబాబుకు జగన్‌కు తేడాను చాటి చెప్పిన కేంద్ర బడ్జెట్)