పైడితల్లమ్మకు పుష్పాలంకరణ
న్యూస్‌తెలుగు/ విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ వారు మంగళవారం స్వర్ణాభరణం, కంచి పట్టుచీర, రవిక వస్త్రం, పుష్పాలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో డివివి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో చదురు గుడి వద్ద ఉన్న అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు నిర్వహించి ఆలయమంతా పుష్పాలతో అలంకరణ చేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనం గుడి పైడితల్లి అమ్మవారికి పళ్ళు పూలతో అలంకరణ చేశారు. పైడితల్లమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఉదయం నుండే విచ్చేశారు. దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు, అర్చకులు ఏడిద వెంకటరమణ పూజలు నిర్వహించారు. దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ప్రసాదం వితరణ అన్నదాన కార్యక్రమాలను ఆలయ సీనియర్ అసిస్టెంట్లు ఏడుకొండలు,మణికంఠ ఆలయ అధికారులు ఆధ్వర్యంలో చేపట్టారు. (Story : పైడితల్లమ్మకు పుష్పాలంకరణ)