ప్రజా సమస్యలు తీర్చే విధంగా మార్పు తేవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రజా సమస్యలు తీర్చే విధంగా మార్పు తేవాలని, నాయకుల, అధికారుల మనసు మార్చాలని బాబా సాహెబ్ అంబేద్కర్ అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి లోని పలు సమస్యలపై అధికారులకు ప్రజాప్రతినిధులకు సంవత్సరాలుగా వినతి పత్రాల ద్వారా విన్నవించుకున్నా వారు సమస్యలపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడాన్ని ఖండిస్తూ వినతి పత్రం అందజేశారు.
పాలిటెక్నిక్ కళాశాల భవనం మరమ్మత్తులు, పాత బస్టాండ్ ఓపెన్ చేసి అక్కడున్న పూల షాపు వారికి జీవనోపాధి కల్పిస్తూ. మిగిలిపోయిన రోడ్డు వెడల్పు చేయాలని, అవినీతి అక్రమాలు చేస్తున్న అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని, అప్పనంగా మున్సిపల్, మరియు హాస్పిటల్ కు సంబంధించిన పాత సామాన్లు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అఖిలపక్ష ఐక్యవేదిక పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడాన్ని అలాగే వర్గ విభేదాలతో అభివృద్ధి కుంటి పడుతుందని వాటిని కూడా నివారించి ఏకతాటిపై వచ్చి అభివృద్ధికి పాటుపడాలని లేని ఎడల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి మరియు హైకోర్టుకు పిల్ వేస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది.
అన్ని కుల సంఘాలతో అన్ని పక్షాలతో మాట్లాడిన తర్వాత ఆగస్టు 15 తర్వాత నిర్ణయం తీసుకుని పై పనుల మొదలు పెట్టకుంటే ధర్నాలు దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొంటున్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు టీ.జే.ఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా, రాష్ట్ర తెలుగు యువత నాయకులు కొత్త గొల్ల శంకర్, సిపిఐ నాయకులు రమేష్, నాయకులు బొడ్డుపల్లి సతీష్, గౌని కాడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజా సమస్యలు తీర్చే విధంగా మార్పు తేవాలి)