UA-35385725-1 UA-35385725-1

గంజాయిని సమూలంగా నిర్మూలించాలి

గంజాయిని సమూలంగా నిర్మూలించాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/ విజయనగరం టౌన్: జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మంగళవారం 2వ పట్టణ పోలీసు స్టేషనుని సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని, పోలీసు బిల్డింగులోని గదులను, లాకప్, ప్రొపర్టీ గదిని పరిశీలించారు. పోలీసు స్టేషను ప్రాంగణంలో సీజ్ చేసిన వాహనాలు ఏ కేసులోనిది అన్న విషయం తెలిసే విధంగా ట్యాగ్ చెయ్యాలని, రికార్డు మెయింటెయిన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బందితో మమేకమై, వారు నిర్వర్తిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. స్టేషనులో పని చేస్తున్న ఎసైలను ఎప్పటి నుండి 2 టౌన్లో పని చేస్తున్నది. గతంలో ఎక్కడ పని చేసినది అడిగి తెలుసుకున్నారు. అనంతరం, స్టేషనులోని క్రైమ్ చార్ట్ ను పరిశీలించి, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో ఏ తరహా నేరాలు జరుగుతున్నది, ఏ ప్రాంతంలో జరుగుతున్నది, నేరాల నియంత్రణకు 2వ పట్టణ పోలీసులు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి వినియోగదారులు ఎక్కువగా పట్టణ శివార్లలో నివసిస్తున్నారని, వారిని అదుపు చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, గంజాయి సేవించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరిపే వ్యక్తులను, గంజాయి వినియోగించే వారిని గుర్తించి, వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రకు దాడులు ముమ్మరం చేయాలని, ఆకస్మికంగా లాడ్జిలు, వాహనాలు తనిఖీ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి, తాత్కాలికంగా నివాసం ఏర్పరుచుకునే వ్యాపారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారు చేసే వ్యాపారులు, తీసుకు వస్తున్న సరుకులు, వాటిని స్టోర్ చేసే గోడౌన్ లను తనిఖీ చేయాలన్నారు. అనంతరం, స్టేషనులో చెడు నడత కలిగిన వ్యక్తుల హిస్టరీ షీట్లును పరిశీలించి, వారిపై హిస్టరీ షీటు నమోదు చేయుటకుగల కారణాలను, ప్రస్తుతం సదరువ్యక్తి స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా పోక్సో, గుట్కా, ఎక్సైజ్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై హిస్టరీ షీట్లును గతంలో నమోదు చేసినట్లుగా 2వ పట్టణ సిఐ వివరించారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నమోదు అయిన కేసులను, ప్రస్తుతం ఆయా కేసుల స్థితులను అధికారులను తెలుసుకున్నారు. లంకా పట్టణం, వైఎస్ఆర్ నగర్, దాసన్నపేట, గాజులరేగ ప్రాంతాల్లో యువతను చైతన్యపర్చి, మంచి ప్రవర్తనతో నడుచుకొనే విధంగా అధికార్లు కౌన్సిలింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదృశ్యం కేసుల్లో నిర్లక్ష్యం వద్దని, వారి ఆచూకీ త్వరితగతిన కనిపెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గంజాయీ అక్రమ రవాణా నియంత్రకు చర్యలు చేపట్టాలని, పట్టుబడిన నిందితులనే కాకుండా అక్రమ రవాణకి కారకులైనప్రధాన నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలన్నారు. స్టేషను పరిధిలో గతంలో పట్టుబడిన గంజాయి కేసుల సిడి ఫైల్స్, పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హిస్టరీ షీట్లును పరిశీలించి, చెడు నడత కలిగి, చురుకుగా ఉన్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, 2వపట్టణ సిఐ కె.రామారావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ కే.కే.వి.విజయనాథ్, 2వ పట్టణ ఎస్సై లు ఐ.దుర్గా ప్రసాద్, రాజేష్, మురళీ, ఏ ఎస్ ఐ పైడితల్లి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : గంజాయిని సమూలంగా నిర్మూలించాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1