వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
న్యూస్‌తెలుగు/వాజేడు-వెంకటాపురం: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం పర్యటించారు. వాజేడు మండలాన్ని చేరుకున్న ఆమె పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. తదనంతరం బొగత ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం డోక్రా మహిళల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని ఈ క్యాంటీన్ల ద్వారా కలుషితమైన ఫుడ్ కాకుండా ఇంట్లో అమ్మ ఎలాగైతే నాణ్యమైనప్పుడు వండుతుందో అదే మాదిరిగా క్యాంటీన్ల ద్వారా పోషక ఆహారాన్ని అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తద్వారా డ్వాక్రా మహిళలను కూడా లక్షాధికారులను చేయడం జరుగుతుందని ఆమె అన్నారు మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలు తీసుకురాబోతుందని ఆమె అన్నారు అందులో భాగంగానే ఇంద్ర మహిళ శక్తి కాంటీన్ మహిళలకు మీసేవ సెంటర్లు త్వరలోనే మహిళల ద్వారా అంగనవాడి పిల్లలకు ఆహారం అందించే కార్యక్రమం తీసుకురాబోతున్నామని ఆమె తెలిపారు. తదనంతరం క్యాంటీన్ వద్ద మొక్క నాటి నీళ్లు పోశారు రైడర్లో ప్రయాణించి బొగత జలపాతం అందాలను తిలకించారు బహుతా అందాలను చూసిన ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బోగత అభివృద్ధికి తమ కృషి చేస్తానని హామీ ఇచ్చారు వరదల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ములుగు జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని ఆమె అన్నారు అటు జిల్లా అధికారి ఇటు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ తో పాటు వైద్య అధికారులు కష్టపడి ప్రజలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని ఆమె అన్నారు వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. ఆమె వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి శ్రీజ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్కకు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
మంత్రి అయ్యాక తొలిసారిగా వాజేడు మండలం వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వాజేడు మండలం కాంగ్రెస్ శ్రేణులు హోసూర్ బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికారు మంత్రి సీతక్కకు సెలవులు కప్పి సత్కరించారు. వాజేడు మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ బాబు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ రాజు వత్సవాయి జగన్నాథరాజు తల్లడి ఆదినారాయణ ఎస్కే కాజావలి చెన్నం ఎల్లయ్య రాణి మేకల రాంబాబు కాకర్లపూడి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. (Story: వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి)