UA-35385725-1 UA-35385725-1

అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు

అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు

హెలికాప్టర్‌లో రెస్క్యూ చేసిన ఉన్నతాధికారులు

అసలు అక్కడ ఏం జరిగింది?

న్యూస్‌తెలుగు/వాజేడు : అడవిలో కూంబింగుకు వెళ్లిన పోలీసు బలగాలు గత రెండు రోజులుగా అడవిలోనే చిక్కుకున్నారు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లోని ఎలిమిడి ప్రాంతంలో గత ఐదు రోజుల క్రితం తెలంగాణ గ్రేహౌండ్స్, సివిల్ పోలీసు బలగాలు ఎన్కౌంటర్ను విజయవంతంగా ముగించారు. ఎన్‌కౌంటర్ ముగిసిన అనంతరం పోలీసు బలగాలు తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అడవుల్లోని వాగులు పొంగిపోయాయి. వాగులు దాటలేక చేసేదేమీ లేక భద్రత బలగాలు గుట్టల్లో ఉన్న పెనుగోలు గ్రామం వద్ద గత రెండు రోజులుగా తలదాచుకున్నట్టు సమాచారం. ఎన్కౌంటర్ ముగిసి తిరుగు ప్రయాణమైన పోలీసు బలగాల నుండి ఇలాంటి సమాచారం అందకపోవడంతో అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు హెలికాప్టర్ సహాయంతో ఏరియల్ సర్వే నిర్వహించి అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలను గుర్తించారు. అనంతరం వారిని రెస్క్యూటీమ్‌ సాయంతో హెలికాప్టర్ ద్వారా వాజేడు మండల పరిధిలోని మండపాక వద్దకు తరలించారు. అయితే ఐదు రోజులుగా అడవిలోనే వర్షంలో ఉండడంతో సరైన ఆహార పదార్థాలు లేక, కాళ్లు వాపులెక్కి నడవలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసు సిబ్బంది వారిని ఎత్తుకుని అక్కడే ప్రత్యేక బస్సులో చికిత్స నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించారు. (Story: అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1