ఆధార్ కార్డు లో మార్పులు, సవరణల కోసం అనధికార వ్యక్తులను ఆశ్రయించవద్దు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఆధార్ కార్డులో సవరణలు వయస్సు మార్పుచేర్పులు చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆధార్ లో మార్పులు, సవరణలు చేస్తామంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తమ దృష్టికి వచ్చిందని అటువంటి వాటిపై నిఘా పెట్టీ వుంచుతామన్నారు. జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన కేంద్రాలు మినహా మరెక్కడా ఆధార్ లో మార్పులు సవరణలు చేసేందుకు అవకాశం లేదని ప్రజలు యీ విషయాన్ని గుర్తించి మోసపో వద్దని కోరారు. అటువంటి వారిని ఆశ్రయించవద్దని కోరారు.
జిల్లాలో తాగునీటిని శుద్ధి చేసి విక్రయిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ తహశీల్దార్ లను ఆదేశించారు. వాటి నిర్వహణ కు అవసరమైన అనుమతులు వున్నదీ లేనిదీ అదే విధంగా వాటిలో సరైన ప్రమాణాలు పాటిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేసి నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు. (Story : ఆధార్ కార్డు లో మార్పులు, సవరణల కోసం అనధికార వ్యక్తులను ఆశ్రయించవద్దు)