ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థకు 149 వినతులు
వినతులకు గడువు లోగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం అధికారులు ఏ రోజు వినతులు ఆ రోజే చూడాలని, నాట్ వ్యూ ఉండకూడదని , అలాగే వచ్చిన వాటిని గడువు లోగా నే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థకు వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు రీ ఓపెన్ అయిన వాటిని కూడా నిర్దేశిత గడువు లోగా పంపాలని, ఆన్లైన్ లో ఏ స్టేజి లో కూడా పెండింగ్ కనపడకూడదని అన్నారు.
సోమవారం వివిధ సమస్యలపై ప్రజల నుంచి 149 వినతులు అందాయి. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కార్తీక్, డి.ఆర్.ఓ. ఎస్.డి.అనిత వినతులు స్వీకరించారు. రెవిన్యూ శాఖ సమస్యలపై 75, డి.ఆర్.డి.ఏ. కు సంబంధించి 14, జిల్లా పంచాయతీ శాఖ కు 10, వైద్య శాఖ కు సంబంధించి 06, మున్సిపల్ శాఖకు 11 చొప్పున అందగా మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. (Story : ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థకు 149 వినతులు)