Home వార్తలు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణ 

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణ 

0

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణ 

శాంసంగ్‌ మొబైల్‌ బిజినెస్‌ హెడ్‌ టిఎం రోప్‌

న్యూస్‌తెలుగు/గురుగ్రామ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లలో ఒకటి భారతదేశం, శాంసంగ్‌కు అతి ముఖ్యమైన మార్కెట్‌లలో ఒకటిగా కొనసాగుతోందని దక్షిణ కొరియాలో అగ్రగామి సంస్థ శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అన్నారు. భారతదేశంలో విక్రయించబడే దాదాపు 80% స్మార్ట్‌ఫోన్‌లు రూ. 30000 కంటే తక్కువ ధరను కలిగి ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఫోల్డబుల్స్‌ వంటి ఉత్పత్తుల వృద్ధిని పెంచుతున్నారు.
ఫోల్డబుల్స్‌ కోసం మెరుగైన రీతిలో గెలాక్సీ ఏఐను అందించటంతో భారతీయ కస్టమర్లు కొత్త గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 6, కొత్త గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6ని స్వీకరించడంపై మాకు అధిక అంచనాలు ఉన్నాయని శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొబైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ టి ఎం రోప్‌ అన్నారు. శాంసంగ్‌ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6 మరియు జెడ్‌ ఫ్లిప్‌ 6 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో అపూర్వ ఆదరణ పొందాయి, కేవలం 24 గంటల్లో మునుపటి తరం ఫోల్డబుల్‌ ఫోన్లతో పోలిస్తే 40% అధిక ప్రీ-ఆర్డర్‌లను నమోదు చేశాయి. ఆరవ తరం గెలాక్సీ ఫోల్డబుల్స్‌లో గెలాక్సీ ఏఐ శక్తి వుంది. ఇది శాంసంగ్‌ ఏఐ టూల్స్‌ దీనిలో ఉండటం వల్ల, ఇది కమ్యూనికేషన్‌ల అడ్డంకులను ఛేదించడంలో, వినియోగదారుల సృజనాత్మకత, ఉత్పాదకతను వెలికితీయడంలో సహాయపడుతుంది. (Story : ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version