రోడ్డుపై నీటి గుంతలలో చేపలు పట్టి నిరసన
న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండలంలోని సలుగు పల్లి నుండి పెంచికల్పేట్ మండలం వరకు రహదారి అంతా గుంతల మయంగా మారింది.కాగజ్ నగర్ నుండి పెంచికల్పేట మీదుగా ఆర్టీసీ బస్సు వస్తున్న క్రమంలో ప్రధాన రహదారిపై గుంతలలో నీరు నిల్వ ఉండడంతో ఆర్టీసీ బస్సును ప్రయాణికులు ఆపి డ్రైవర్ ప్రయాణికులు నీటి గుంతలలో చేపలు పట్టి నిరసన తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా రహదారి అంతా గుంతల మయంగా ఉండడంతో ప్రయాణికులు నానా తండాలు పడుతున్నామని వాపోతున్నారు. కనీసం అధికారులు గుంతలకు తాత్కాలిక మరమ్మత్తులు సైతం చేపట్టకపోవడంతో బస్సులు,ఆటోలు, ద్విచక్ర వాహనదారులు, 108 అంబులెన్సులు అత్యవసర సమయంలో వెళ్లలేని పరిస్థితిగా మారిందని ప్రయాణికులు తెలుపుతున్నారు. గుంతలలో పడి వాహనాలు సైతం చెడిపోతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం పై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి తాత్కాలిక మరమ్మత్తులైన చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రహదారిపై చేపలు పట్టే నిరసన కార్యక్రమాన్ని చూసేనా అధికారులు స్పందిస్తారో లేదో మరి వేచి చూడాల్సిందే..(Story : రోడ్డుపై నీటి గుంతలలో చేపలు పట్టి నిరసన )