Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చాట్రాయి ఎంపిటిసిలు ఫస్ట్ టైం ఎటాక్!

చాట్రాయి ఎంపిటిసిలు ఫస్ట్ టైం ఎటాక్!

0

చాట్రాయి ఎంపిటిసిలు ఫస్ట్ టైం ఎటాక్!

ఎంపీపీ గారు ఏముందో మీకు తెలుసా?

ఎంపిటీసిలకు తెలియకుండా వర్క్ లు ఎలా పెడతారు?

న్యూస్‌తెలుగు/ చాట్రాయి :
ఎంపీపీ గారు……? ఆ కాగితాల్లో ఏమిరాసుందో ….? ఎంపీటీసీలకు తెలియకుండా రాసిచ్చిన వర్క్లను మేము అంగీకరించం అంటూ కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతకుంట్ల వెంకటేశ్వరరావు బాహాటంగా వ్యతిరేకించగా పలువురు ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. ఎంపీపీ లంక నిర్మల మాట్లాడుతూ . నాకు తెలియదు వర్క్ ఆపండని ఆదేశించారు.శనివారంమధ్య హన్నం చాట్రాయి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తొలిసారిగా ఎంపీటీసీలు పెత్తందారి విదానాన్ని ఎటాక్ చేశారు. అధికారులు కంగు తిన్నారు. చాట్రాయి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ లంక నిర్మల అధ్యక్షతన జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు తొలిసారిగా మాకు తెలియకుండా వర్కులు ఎలా మంజూరు చేస్తున్నారు….?ఎవరు అడిగిన వర్క్ లు ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎజెండా కాపీలో లేకుండా చిన్నంపేటలో 3 లక్షల రుపాయల వర్క్ అనుమతికి కింద నుంచి విడిగా పంపించడంతో కృష్ణారావు పాలెం ఎంపీటీసీ చింతకుంట్ల వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీపీ గారు….. కాగితాల్లో ఏమి రాసిందో మీకు తెలుసా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మా జీవితంలో తొలిసారిగా ఎజెండా కాపీలు చేతికి ఇచ్చారు. మాకు తెలియకుండా మా గ్రామాల్లో వర్కులు పెట్టారంటూ ప్రశ్నించారు. తెలియకుండా రాసిన ఏజెండాను ఎంపీపీ కూడా తిరిగి వెనక్కి పంపించారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న మండల పరిషత్తులో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం . జడ్పిటిసి చెలికాని అనూష మాట్లాడుతూ. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ సందర్భంగా మండలంలో ప్రజాప్రతినిధుల మైన మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏమిటి అన్నారు. అధికారం అనధికారం ఎలా ఉన్నా తాము ప్రజాప్రతినిదులమని పలువురు ఎంపీటీసీలు అధికారులకు గుర్తు చేశారు. సమావేశం మొత్తం వాడిగా వేడిగా జరగడం గమనర్హం. (Story : చాట్రాయి ఎంపిటిసిలు ఫస్ట్ టైం ఎటాక్!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version