UA-35385725-1 UA-35385725-1

మనసుకి హత్తుకునేలా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి ‘సారా సారా’ పాట విడుదల* 

మనసుకి హత్తుకునేలా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి ‘సారా సారా’ పాట విడుదల* 

న్యూస్‌తెలుగు/సినిమా హైద‌రాబాద్ : టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకులు హీరోలుగా.. హీరోలు దర్శకరచయితలుగా మారుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కూల్ అప్డేట్‌ను ఇచ్చారు. బయట ఉన్న కూల్ వెదర్‌కు తగ్గట్టుగా, మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాటను వదిలారు. సారా సారా అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తిక్ బి కొడకండ్ల ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేశారు.
తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు (Story : మనసుకి హత్తుకునేలా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి ‘సారా సారా’ పాట విడుదల)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1