హానర్ స్మార్ట్‌ఫోన్ 200 సిరీస్ విడుదల
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ:హానర్ భారతీయ మార్కెట్‌లో దాని పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తుంది. ఇది తాజాగా హానర్ 200 సిరీస్ లాంచ్‌ని ప్రకటించింది. ఇది నంబర్ లైన్ అప్‌లో ఇది చాలా గొప్పది. హానర్ 200 ప్రో 5జీ, హానర్ 200 5జితో పాటు, ఇది పవర్, సృజనాత్మకత ఫీచర్స్‌ని పుష్ చేస్తుంది. వినియోగదారులకు అత్యధిక పనితీరుని అందిస్తూ ఏఐ పవర్ చేసిన కొన్ని పోర్ట్రైట్ సమర్ధ్యాలను కూడా అందిస్తుంది. ఇది మెరుగైన డిస్‌ప్లేలను, ఎన్నడూ చూడని హార్డ్వేర్ పనితీరుని, వినియోగదారులకు మెరుగైన ఏఐ అనుభవాలను కూడా అందిస్తుంది. హానర్ 200 ప్రో 5జి రెండు అందమైన రంగులలో అనగా ఓషియన్ సియాన్, నలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి 57,999 రూపాయలలో అందుబాటులో ఉంటాయి. వాటి అమ్మకం 20 జులై అర్ధరాత్రి 12:00 నుంచి అమెజాన్ డాట్ ఇన్, బ్రాండ్ వెబ్‌సైట్ అయిన-ఎక్స్‌ప్లోర్‌హానర్.కామ్ మీకు దెగ్గరలో ఉన్న ఇతర ముఖ్యమైన స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. జులై 20 నుంచి 23వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో వినియోగదారులు అందరికీ 8000 రూపాయల తక్షణ తగ్గింపుతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ బ్యాంక్ కార్డ్ ఉన్న వారు 3000 రూపాయల తగ్గింపుని పొందవచ్చు. వినియోగదారులు 8,499 రూపాయలు విలువ చేసే హానర్ బహుమతులను కొన్ని ఎంచుకునే విభాగాల్లో పొందవచ్చు.దానికి బదులు 2000 రూపాయల తక్షణ తగ్గింపు కూపన్ ని కూడా పొందవచ్చు. (Story : హానర్ స్మార్ట్‌ఫోన్ 200 సిరీస్ విడుదల)

