Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందరికీ చేయూత ఇస్తుంది

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందరికీ చేయూత ఇస్తుంది

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందరికీ చేయూత ఇస్తుంది

ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/గుంటూరు :గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు కార్యాలయం నందు గుంటూరు పట్టణ స్వర్ణకారులు సంఘం సభ్యులు శాసనసభ్యులు మొహమ్మద్ నశీర్ ని మర్యాదపూర్వకంగా కలిసి దుశాలవాలతో సన్మానించారు.
గుంటూరు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు పఠాన్ మహమూద్ ఖాన్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. గుంటూరు నగరంలో స్వర్ణకారుల సంఘం వారికి ప్రభుత్వ సహాయంతో షాపులు నిర్మాణం చేయించాటనికి కృషి చేయాలని ఆయనకు విన్నమించి తాను ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ్యులు దృష్టికి తీసుకుని వచ్చారు . ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మా కూటమి ప్రభుత్వం అందరికీ త్వరలోనే చేయూత ఇస్తుందని, మీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వo దృష్టికి తీసుకెళ్తామన్నారు. చేతివృత్తుల వారికి మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహేష్, అనిల్, సాయి భద్రం, కరిముల్లా, ఖాదర్ మహమ్మద్ రిహాన్, వెంకట్రావు జానీ భాష ,ఆరిఫ్ స్వర్ణకార సంఘం వారు వున్నారు. (Story : స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందరికీ చేయూత ఇస్తుంది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!