Home వార్తలు The GOAT నుంచి సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’సాంగ్ రిలీజ్ 

The GOAT నుంచి సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’సాంగ్ రిలీజ్ 

0

The GOAT నుంచి సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’సాంగ్ రిలీజ్ 

న్యూస్‌తెలుగు/సినిమా హైద‌రాబాద్ :దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ విజిలేస్కో సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.
తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ నిన్ను కన్న కనులే రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఫ్యామిలీ బాండింగ్ ని చాలా వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా యువన్ శంకర్ రాజా, ఎస్పీ చరణ్, చిత్ర తమ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సూపర్ మెలోడీ హిట్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు.
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. (Story : The GOAT నుంచి సెకండ్ సింగిల్ ‘నిన్ను కన్న కనులే’సాంగ్ రిలీజ్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version