పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి పై మున్సిపల్ అధికారులతో గళ్ళా మాధవి సమీక్ష
న్యూస్‌తెలుగు/గుంటూరు:
గుంటూరుగుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా నియోజకవర్గములోని సమస్యల వినతిపత్రాలను మరియు సమస్యల ఫోటోలను కమిషనర్ చేకూరి కీర్తికి, నివేదిక రూపంలో అందజేసి, అత్యవసరంగా వీటిని పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి సమస్య పరిష్కారానికి ఒక నిర్దేశిత గడవు ఉండాలని, అలాగే నేను ఇచ్చే సమస్యల పరిష్కారినికి కూడా ఒక గడువు చెప్పాలని ఎమ్మెల్యే కోరారు. ప్రధానంగా ఏ.టి అగ్రహారం మెయిన్ రోడ్డు, నంబూరు సుభాని కాలనీ లలో త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రతి పేదవాడి కడుపులు నింపే అన్నా క్యాంటిన్ లను ఆగస్టు 5 లోపు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధము చేయాలని కోరారు. కలెక్టరేట్ నుండి 3 బొమ్మల సెంటర్ వరకు ఉన్న బిటి రోడ్డుకు అత్యవసరంగా ప్యాచీ వర్కులు నిర్వహించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయము చేసుకొని, ప్రజాసమస్యలు పరిష్కరించాలన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాల పై ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని, పేర్కొంటూ ఉద్యోగ నగర్, గుజ్జనగుండ్ల పార్కులలో ప్రధాన సమస్యల పై చర్చించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు కాలువల్లో నుండి తొలగించిన వ్యర్ధాలను అదే రోజు తొలగించాలని, మ్యాన్ హొల్స్ పై దృష్టి పెట్టాలన్నారు. అధికారులు మరియు ప్రజానిధులము కలిసి గుంటూరు నగరాన్ని సుందరీకరించుకుందమన్నారు.ఈ సమీక్షలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. (Story : పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి పై మున్సిపల్ అధికారులతో గళ్ళా మాధవి సమీక్ష)