ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం
రెండు రోజుల్లో గుడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల
గుడిపల్లి రిజర్వాయర్ సందర్శించి పరిశీలించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం లోని ప్రతి ఎకరా సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. మరో రెండు రోజుల్లో గుడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గుడిపల్లి రిజర్వాయర్ ను సందర్శించి పరిశీలించారు ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లు ఎత్తడంతో జూరాల ప్రాజెక్టుకు నీటి తాకిడి భారీగా పెరిగిందని నేడో రేపో జూరాల గేట్లు ఎత్తిన అనంతరం గుడిపల్లి నుంచి సాగునీరు విడుదల అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగునీటిపరంగా అన్నదాతలు ఎవరు అధైర్య పడొద్దని అవసరమైతే సొంత నిధులతో కెనాలకు మరమ్మత్తు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద ఉన్న సమస్యలకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రేవల్లి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పర్వతాలు మాజీ ఎంపీపీ సత్యశీలా రెడ్డి నాయకులు జయపాల్ రెడ్డి, అచ్యుత రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు