ఆర్.నారాయణ మూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : నిమ్స్ ఆసుపత్రిలోగత మూడు రోజుల నుండి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సినీనటుడు ఆర్.నారాయణ మూర్తిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల సేవాదృక్పతం కలిగి పేదప్రజల హక్కుల కోసం ప్రజలను చైతన్యపరిచే ఎన్నో చిత్రాలు నిర్మించి సమాజానికి సందేశం ఇచ్చిన నారాయణ మూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ నిరంజన్ రెడ్డితో నాకు ఆత్మీయానుబంధం ఉందని అన్నారు.స్వయంగా రైతు అయిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించారని అన్నారు.రైతులను దోచుకొనే నల్లచట్టాలను నిరసించి రైతుల ప్రయోజనాలు కాపాడరాని అన్నారు. నాపై ప్రేమతో వచ్చి పరామర్శించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు.తాను ఆరోగ్యంగా ఉన్నానని పూర్తిగా కోలుకున్నానని దుష్ప్రచరాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. (Stort : ఆర్.నారాయణ మూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)