ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: ఐఐఆర్‌ఎఫ్ ద్వారా తెలంగాణ, హైదరాబాదులో నెంబర్ వన్ ర్యాంకింగ్ పొందిన చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇటీవల ఐబిడిపి, కేంబ్రిడ్జ్ ఐజిసిఎస్‌ఈ, సీబీఎస్‌ఈ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధించినట్టు అంతర్జాతీయ విభాగం ప్రిన్సిపాల్ సంచిత రాహా, తెలిపారు. ఐబీడీపీ మే 2024 పరీక్షలో, 95 మంది విద్యార్థుల బృందంలో, పాఠశాల ఈ సంవత్సరం సగటు 34 స్కోర్‌ను సాధించి, ప్రపంచ సగటు 30.32ని అధిగమించిందన్నారు. ముఖ్యంగా 15 మంది విద్యార్థులు 40 గ్రేడ్ పాయింట్లకు పైగా సాధించారన్నారు. అత్యుత్తమ ప్రదర్శనకారులైన స్పృహ డియో, ఆమని సుసానా మద్దుకూరి 45కి 44 సాధించారన్నారు. కేంబ్రిడ్జ్ ఐజిసిఎస్‌ఈ 2024 పరీక్షల్లో 186 ఏ ప్లస్, 183 ఎ ఎంట్రీలతో అన్ని సబ్జెక్టులలో నూరు శాతం ఉత్తీర్ణత రేటు సాధించిందన్నారు. అదే రీతిలో 12వ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలు కూడా సాధించామన్నారు. అగ్ర విద్యార్థి దర్శికా సన్వారియా 96.8 శాతం స్కోర్ సాధించగా, 86.7 శాతం మంది విద్యార్థులు 75 శాతం, అంతకంటే ఎక్కువ సాధించారన్నారు. 10వ తరగతి సీబీఎస్‌ఈ లో కోసం, 93 శాతం మంది విద్యార్థులు 75 శాతం అంతకంటే ఎక్కువ స్కోర్‌లతో ఇద్దరు 99.2 శాతం స్కోర్లు చిరెక్ విద్యార్థులు సాధించారని చెప్పారు. (Story : ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్)