Home వార్తలు రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో ‘ఏఐ’ పాత్ర అమోఘం

రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో ‘ఏఐ’ పాత్ర అమోఘం

0
Dr Geethika VakatiConsultant, Breast and General Surgeon,Apollo Cradle & Children's Hospital, Kondapur.

రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో ‘ఏఐ’ పాత్ర అమోఘం

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ పాత్ర అమోఘమని అపోలో క్రెడిల్‌, చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ (కొండాపూర్‌) కన్సల్టెంట్‌, బ్రెస్ట్‌, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ గీతిక వకాటి తెలిపారు. కచ్చితత్వంలోనూ సామర్థ్యంలోనూ ఎంతో పురోగతి కలదన్నారు. ప్రపంచంలో మహిళల మరణాలకు రొమ్ము క్యాన్సర్‌ ప్రధాన కారణం అన్నారు. ఈ ఆవిష్కరణలు ఎందరో ప్రాణాలను కాపాడటంలో సహాయపడనున్నాయని పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అప్లికేషన్‌ ఇమేజింగ్‌ విశ్లేషణలో సహాయపడుతుందని తెలిపారు. సంప్రదాయ మామోగ్రఫీ ముందుగా గుర్తించడానికి కీలకమైన సాధనమన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథమ్‌ల ద్వారా అది పెంచబడుతుందన్నారు. డేటాసెట్‌లపై శిక్షణ పొందిన ఈ అల్గారిథమ్‌లు మామోగ్రామ్‌లలోని సూక్ష్మ అసాధారణతలను కచ్చితత్వంతో గుర్తించగలవన్నారు. రేడియాలజిస్టులు మిస్‌ అయిన క్యాన్సర్‌లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గుర్తించగలదన్నారు. (Story : రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో ‘ఏఐ’ పాత్ర అమోఘం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version