Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాలిక‌ కుటుంబానికి క‌లిశెట్టి ప‌రామ‌ర్శ‌

బాలిక‌ కుటుంబానికి క‌లిశెట్టి ప‌రామ‌ర్శ‌

0

బాలిక‌ కుటుంబానికి క‌లిశెట్టి ప‌రామ‌ర్శ‌

న్యూస్‌తెలుగు/ విజయనగరం :
బొబ్బిలి నియోజకవరగం, రామభద్రపురం మండలం, జీలికవలసలో  విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అక్కడ వారితో మాట్లాడి జరిగిన విషయాలు తెలుసుకొని ఇలాంటి సంఘటన జరగడం అమానుషం అని, బాధాకరమని చెప్పి అనంతరం అక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్ సంఘటన జరిగిన వెంటనే సకాలంలో స్పందించి తగు చర్యలు తీసుకోవడంతోపాటు వెనువెంటనే విషయం తెలుసుకున్న అధికారులు, నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉండటం అనేది అభినందనీయకం అని విజయనగరం పార్లమెంట్ సభ్యులు  కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరిగిన సంఘటనపై వెంటనే స్పందించి కలెక్టర్లకు, ఎస్పీ ల, నాయకులతో మాట్లాడి విషయం తెలుసుకొని తగు సూచనలు ఇచ్చి ఇలాంటి విషయాలు పునరావుతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు ఇవ్వటం జ‌రిగింద‌న్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని స్వయంగా పర్యవేక్షించి, అంగన్వాడీ టీచర్ని అభినందించి, అక్కడ ఉన్న స్థానిక ఇబ్బందులు మరియు ప్రజలు గ్రీవెన్స్ తెలుసుకొని,
అనంతరం గిరిజన ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు
ఈ సందర్భంగా అప్పలనాయుడు రోడ్లు, స్కూల్స్, మొదలైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి సంబంధిత అధికారులకు సూచించారు. (Story : బాలిక‌ కుటుంబానికి క‌లిశెట్టి ప‌రామ‌ర్శ‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version