Home వార్తలు ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను గౌరవించిన టిఐఐ

ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను గౌరవించిన టిఐఐ

0

ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను గౌరవించిన టిఐఐ

న్యూస్‌తెలుగు/దేవరాపల్లి: సమకాలీన వ్యవసాయ పద్ధతుల ప్రయోజనాలను ప్రదర్శించడం ద్వారా మెరుగైన ఉత్పాదకత సాధించిన ఆంధ్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రగతిశీల రైతులను సత్కరించేందుకు పొగాకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (టిఐఐ ) సోమవారం పొగాకు రైతుల అవార్డుల 24వ ఎడిషన్‌ను నిర్వహించింది. దానితో పాటు, పొగాకు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన, నిబద్ధతను గుర్తించేందుకు ఇన్స్టిట్యూట్‌ టిఐఐ పొగాకు శాస్త్రవేత్త అవార్డుల ప్రారంభ ఎడిషన్‌ను సైతం నిర్వహించింది. పొగాకు పంటల పరిశోధన, పంటల అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ఇకపై ప్రతి ఏటా అందజేస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంట్‌ సభ్యులు డి.పురందేశ్వరి, పుట్ట మహేష్‌ కుమార్‌, శాసనసభ సభ్యులు మద్దిపాటి వెంకట రాజు చైర్మన్‌, పొగాకు బోర్డు, యశ్వంత్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌, పొగాకు బోర్డు, జి. వాసుబాబు, డైరెక్టర్‌ సిటిఆర్‌ఐ, డాక్టర్‌ ఎం.శేషు మాధవ్‌, పొగాకు బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్‌, బిజెపి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు పాల్గొన్నారు. (Story :ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను గౌరవించిన టిఐఐ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version