మా గ్రామం గుర్తింపు లేదా?
న్యూస్‌తెలుగు/ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : పెంచికల్పేట్ మండలంలోని జైహింద్ పూర్ గ్రామానికి రోడ్డు బురదమయంగా ఉండడంతో గ్రామ ప్రజలు నానా తండాలు పడాల్సిన పరిస్థితిగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్డు అంతా బురదమయంగా మారుతుంది. వివిధ పనుల కోసం గ్రామం నుండి వాహనాలతో వెళ్లాలంటే బురదలో నానా తంటాలు పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి గా మారింది. జైహింద్ పూర్ గ్రామం ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఎన్నికల సమయంలో గ్రామానికి ప్రచారానికి నాయకులు వస్తుంటారు తప్ప సమస్యలు మాత్రం పట్టించుకోవడంలో నాయకులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు సైతం జైహింద్ పూర్ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి 108 అంబులెన్స్ సైతం, ఆటోలు సైతం రాని పరిస్థితిగా మారింది. రోడ్డంతా బృతమయంగా ఉండడంతో బాటసారులు సైతం బురదలో తిప్పలు పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితిగా మారింది. జైహింద్ పూర్ గ్రామం ప్రభుత్వo దృష్టిలో గుర్తింపు ఉందో లేదో అని గ్రామ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం గుర్తింపులో ఉంటే రోడ్లు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేసే వారిని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ ప్రజలు పడుతున్న తిప్పలను చూసైనా రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. (Story : మా గ్రామం గుర్తింపు లేదా?)