Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క్వారీలలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తాం

క్వారీలలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తాం

0

క్వారీలలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తాం

టీఎస్ఎండిసి పిఓ శ్రీరాములు..

న్యూస్‌తెలుగు/ వాజేడు: ఇసుక క్వారీ లలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తామని టి ఎస్ ఎం డి సి పిఓ శ్రీరాములు అన్నారు. శనివారం వెంకటాపురం మండలంలోని ఇసుక క్వారీలను తనిఖీ చేసిన పిఓ వీరభద్రవరం ఇసుక క్వారీలో జరుగుతున్న అక్రమాలపైఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లోడింగ్ 3500 వసూలు చేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గ్యానం వాసు పిఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన టిఎస్ఎండిసి పిఓ క్వారీలలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తామని ఇకపై క్వారీలలో లోడింగ్ సంబంధించి ఎవరు డబ్బులు తీసుకోవద్దని నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నాన్న బండ్లను సైతం వారిలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సీరియల్ తప్పించి లారీకి 1500 వసూలు చేసి వెనక ఉన్న బండ్లను ముందుకు పంపి లోడింగ్ చేపిస్తున్నారని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్టి సమస్యలపై స్పందించిన వీరభద్రారం ఇసుక క్వారీలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామని పిఓ శ్రీరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎండిసి ఎస్ఆర్ఓ ఉపేందర్, సిపిఎం నాయకులు సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.రు. అదేవిధంగా వీరభద్రారం ఇసుక క్వారీలో రోజుకు వేల సంఖ్యలో ఆన్లైన్ పెట్టడంతో వచ్చిన లారీలన్ని రహదారిపై ఉండడం వల్ల అడుగ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరభద్రవరం క్వారీలో ఇప్పటివరకు ఉన్న అన్ని లారీలను లోడ్ చేసే వరకు ఆన్లైన్లో నిలుపుదల చేయాలని వారు పిఓను కోరారు. (Story : క్వారీలలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version