శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 ఫోన్లు విడుదల
న్యూస్‌తెలుగు/గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, గెలాక్సీ ఏఐ తదుపరి అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ, భారతదేశంలో తమ ఆరవ తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు -గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్6ల కోసం ముందస్తు బుకింగ్‌లను తెరిచింది. కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్6లు గెలాక్సీ ఏఐని నూతన శిఖరాలకు తీసుకువెళ్లనున్నాయి. వినియోగదారులకు ప్రత్యేకమైన మొబైల్ అనుభవాల శ్రేణిని అందిస్తాయి. శాంసంగ్‌లో మా ఆరవ తరం ఫోల్డబుల్స్- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్6తో గెలాక్సీ ఏఐ తదుపరి అధ్యాయాన్ని తెరవడానికి మేము సంతోషిస్తున్నామని శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్ అన్నారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్6 కోసం ముందస్తు బుకింగ్ జూలై 10 నుండి అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమైంది. వినియోగదారులు ఈరోజు నుండి శాంసంగ్ లైవ్‌లో శామ్‌సంగ్.కామ్‌లో ముందస్తు బుకింగ్ చేయవచ్చు. రూ. 9,999 విలువైన రెండు స్క్రీన్/భాగాల భర్తీ ప్యాక్ ఏ కేవలం రూ. 999 మాత్రమే.