Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంకల్పంతోనే ఎన్డీయే కూటమి ఘన విజయం

ప్రజల సంకల్పంతోనే ఎన్డీయే కూటమి ఘన విజయం

0

ప్రజల సంకల్పంతోనే ఎన్డీయే కూటమి ఘన విజయం

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

న్యూస్‌తెలుగు/నందిగామ పట్టణం : ప్రజ ల సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం నందిగామ నియోజకవర్గ భారతీయజనతా పార్టీ కార్యవర్గ విస్త్రృతస్థాయి సమావేశం బాబు జగ్జీవన్ రామ్ కళ్యాణమండపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రసంగించారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పు సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారని, రాష్ట పునర్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదంటే అది చేస్తానంటే ప్రజలు క్షమించరనే విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. ప్రజలు తమకు కట్టబెట్టింది అధికారం కాదని, బాధ్యతని తంగిరాల సౌమ్య చెప్పారు. నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే తపనతో పొరుగు రాష్ట్రాలతోపాటు, విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వేశారన్నారు. దీని ఫలితంగా రికార్డు స్థాయి మెజార్టీలు వచ్చాయని చెప్పారు. నియోజకవర్గంలో జరిగే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో సమానత్వంతో ముందుకు వెళతామని తెలిపారు. సైకో మనస్తత్వం కలిగిన జగనరెడ్డిని గద్దె దింపటానికి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గట్టి సంకల్పం తీసుకోవటం వల్లే చంద్రబాబు వంటి దార్శనికు డు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ నేతలు సీహెచ్ శ్రీనివాసరావు, తొర్లికొండ సీతారామయ్య, సున్నారెడ్డి దయాకర్ రెడ్డి, అట్లూరి శ్రీరామ్, మాదాల రమేష్, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కొత్త సాంబశిరావు, పోరండి నరసింహారావు, జి. శివకృష్ణా రెడ్డి, శర్మ, రావూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజల సంకల్పంతోనే ఎన్డీయే కూటమి ఘన విజయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version