Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జగన్‌పై షర్మిల విమర్శలు

జగన్‌పై షర్మిల విమర్శలు

0

జగన్‌పై షర్మిల విమర్శలు

న్యూస్ తెలుగు / విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టాడని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం ప్రస్తుత ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పనేనని అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని చంద్రబాబు నాయుడును కోరుతున్నామని తెలిపారు. (Story :జగన్‌పై షర్మిల విమర్శలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version