రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిచేస్తాం
అవసరమగు అనుమతులన్నీ వేగవంతం చేస్తాం
జూన్ 2026 నాటికి ఆపరేషన్ లోకి తేవాలి
ఎక్స్పీరియన్స్ సెంటర్ లో పవర్ పాయింట్ ను వీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్‌తెలుగు/విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్ట్ కు అవసరమగు అనుమతులను, కనెక్టివిటీ పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఎయిర్పోర్ట్ లో జి.ఎం.ఆర్. సంస్థ ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. జి.ఎం.ఆర్. సంస్థ బిజినెస్ చైర్మన్ జిబీఎస్ రాజు, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.పి.రావు పవర్ పాయింట్ ద్వారా ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశాలను వివరించారు. ఎయిర్పోర్ట్ కు సంబంధించి 97 శాతం ఎర్త్ వర్క్స్ , 32 శాతం రన్వే పనులు, టాక్సీ వే పనులు 16 శాతం వరకు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కి సంబంధించి విశాఖ నుండి భోగాపురం మధ్య 12 క్రిటికల్ జంక్షన్లు ఉన్నాయని, వాటి పై ఫ్లై ఓవర్స్, బ్రిడ్జెస్ వేయవలసిన అవసరం ఉందని , ఇప్పటికే నేషనల్ హై వేస్ అధ్యయనం చేయడం జరిగిందని వివరించారు. భోగాపురం నుండి శ్రీకాకుళం వరకు ఉన్న స్టేట్ హై వేస్ ను 2 లైన్ల నుండి 4 లైన్ల కు మార్చాలని, విశాఖపట్నం బీచ్ నుండి భోగాపురం వరకు 6 లేన్ల రహదారి వేయాలని, డెడికేటెడ్ ఎక్ష్ప్రెస్స్ వే ను వేయడం ద్వారా టూరిజం కారిడార్ ను కూడా అభివృద్ధి చేసినట్లు అవుతుందని సి.ఎం కు తెలిపారు. తారకరామా తీర్ధ సాగర్ పూర్తి చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ కు నీటి సమస్య లేకుండా చూడాలని వివరించారు. పైప్ లైన్స్ ను 12 కి.మీ వరకు వేయడం జరిగిందని అప్రోచ్ రోడ్, పంప్ హౌస్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వవలసి వుందని తెలిపారు. స్టాఫ్ క్వార్టర్స్ కోసం 24 ఎకరాల భూమి కేటాయించారని, ఇందులో 21 ఎకరాలను ఇప్పటికే అప్పగించారని, 3 ఎకరాల వరకు కోర్ట్ స్టే లో ఉందని, స్టే ఆర్డర్ ను ఎత్తివేసేలా చూడాలని సి ఎం ను కోరారు. 132 కే.వి సబ్ స్టేషన్ కోసం 5.47 ఎకరాలను కేటాయించారని, గత రెండు నెలలుగా బిల్లులు చెల్లించలేదని, నిధులు కేటాయిస్తే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని కోరారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ అన్ని రకాల అనుమతులను, నిధులను , కనెక్టివిటీ వ్యవహారాలను అత్యంత ప్రాధాన్యత నచ్చి చేస్తామని, పనూ వేగంగా జరిగి 6 నెలల ముందే ఆపరేషన్ లోకి వచ్చేలా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కెనడా పౌర విమాన యాన శాఖా మంత్రి కే.రం మోహన్ నాయుడు, రాస్త్యహ్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస రావు , స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిది సంద్యారాణి, ఎం.పి కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లాకు చేనిన శాసన సభ్యులు, జి.ఎం.ఆర్ బిసిఎం బి.వి.ఎన్ రావు, కేంద్ర పౌర విమాన శాఖ కార్యదర్శి, ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ , మాజీ పౌర విమాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ , ఆర్.డి.ఓ సూర్య కళ తదితరులు పాల్గొన్నారు. (Story: రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిచేస్తాం)