నీటి పన్ను బకాయిలపై ఉపేక్షించేది లేదు
న్యూస్ తెలుగు/విజయనగరం: నీటి పన్ను బకాయిలను ఉపేక్షించబోమని నగరపాలక సంస్థ ఈఈ కే.శ్రీనివాసరావు అన్నారు. దీర్ఘకాలంగా నీటి పన్ను చెల్లించని వినియోగదారుల కుళాయిలను నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. కమిషనర్ ఎంఎం నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం 31వ నెంబర్ సచివాలయం పరిధిలో నీటి బకాయి పేరుకుపోయిన వినియోగదారుని కుళాయి కనెక్షన్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఈఈ కే శ్రీనివాసరావు మాట్లాడుతూ నీటి పంపిణీకి ఎంతో వ్యయ, ప్రయాసలు అవుతోందని,అట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటి వినియోగదారులు తప్పనిసరిగా సకాలంలో పన్నులను చెల్లించాలని అన్నారు. లేని పక్షంలో నీటి సరఫరాను నిలుపుదల చేస్తామని తెలిపారు. నీటిని వృధాగా చేయకుండా ఆన్ ఆఫ్ స్విచ్ లను తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు. నీటి వినియోగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. (Story: నీటి పన్ను బకాయిలపై ఉపేక్షించేది లేదు)