రైళ్ల ఆలస్యం..ప్రయాణికుల అగచాట్లు
న్యూస్ తెలుగు/విజయనగరం: గత కొద్ది రోజులుగా విజయనగరం మీదుగా వెళ్లే ట్రైన్లన్ని లేటుగా వెళ్లడంతో ప్రయాణికులకు నానా అవస్థలు గురికాక తప్పటం లేదు ఇదే పరిస్థితి ప్రయాణికులకు ఎదురయింది భువనేశ్వర్ టు సోలాపూర్ సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 9.50 నిమిషములకు విజయనగరం రైల్వే స్టేషన్ కు చేరుకోవలసి ఉండగా ఆ బండి ఏకంగా 24 గంటల తర్వాత అంటే మంగళవారం ఉదయం 10 గంటలకు రావడంతో ప్రయాణికులు నానా అవస్థలు గురికాక తప్పలేదు. ముందుగా ఎనిమిది గంటలు ఆలస్యంగా నడుస్తుందని సమాచారం అందించారు. ఆ ఎనిమిది గంటల తరువాత విజయనగరం రైల్వే స్టేషన్ కు ప్రయాణికులంతా చేరుకోవడం జరిగిందే అయితే వీరికి 8 గంటల ముందే మరో సమాచారం వారి మొబైల్ కి రావడం జరిగిందన్న విషయాన్ని ప్రయాణికులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు సోమవారం మంగళవారం ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రయాణికులు సుదీర్ఘ ప్రాంతాల్లో నుంచి వచ్చారన్న విషయాన్ని మరిచిన రైల్వే అధికారులు వాళ్లకు ఎటువంటి భోజన వసతులు కల్పించకపోవడం బాధాకరం. మంగళవారం కూడా సమయానికి టైం రాకపోవడంతో రైల్వే స్టేషన్ మాస్టర్ మురళీకృష్ణతో ప్రయాణికులంతా వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మాట్లాడుతూ ఇది ఎక్కడ ఒక సమస్య కాదని దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో భాగంగా ఈ సమస్య ఏర్పడిందని ప్రయాణికులకు తెలియజేశారు. దేశం వ్యాప్తంగా అన్ని రైలు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గాను ఈ ట్రాక్ పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర, దేశవ్యాప్తంగా పలు రైలు రద్దు అయ్యాయని ఈ విషయాలను ప్రజలంతా గుర్తించాలన్నారు. ప్రయాణికులు ప్రయాణాలు చేసేటప్పుడు తమ మొబైల్ లో వచ్చే మెసేజ్‌లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. (Story: రైళ్ల ఆలస్యం..ప్రయాణికుల అగచాట్లు)