20న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం
న్యూస్ తెలుగు/విజయనగరం టౌన్ః ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం, ఊరేగింపు ఈనెల 20న వనంగుడి నిర్వహిస్తున్నట్లు పైడితల్లి ఆలయ ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు, దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు తెలిపారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారి ప్రతిమలను ఇఓ తలయారులకు అందజేసారు. వాటిని ఆలయంలో పూజించిన తదుపరి డప్పువాద్యాల నడుమ అమ్మవారి సమక్షంలో తెలిపి తదుపరి ఆలయం ప్రాంగణంలో ప్రజలకు చాటింపు చేసారు. ఈసందర్భంగా ఇఓ ప్రసాదరావు, అర్చకులు వెంకటరావులు మాట్లాడుతూ ఈనెల 20న వనంగుడిలో సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారికి స్నపనం, అలంకరణలు చేసి ప్రత్యేక రథంపై ఊరేగింపు గా కొత్తపేట, చదురుకుచేర్చి ఆరోజు రాత్రిమేళతాళాలతో చదురుగుడికి అమ్మవారిని తీసుకువస్తారని అక్కడ అమ్మవారు ఉయ్యాల కంబాల ఉత్సవంవరకు భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. భక్తులు ఈ ఉత్సవాలు జయప్రదంచేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, తలయారులు, దేవస్థానం సీనియర్ సహాయకులు ఏడుకొండలు, శ్రీ నివాసరాజు, వేదపండితులు పాల్గొన్నారు. (Story: 20న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం)