Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

మహిళా సాధికార సదస్సులో వక్తల పిలుపు

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్, ప్రజ్వల సంఘం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళా సాధికార సదస్సు ఆదివారంనాడు జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్, విజయనగర శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలులో మహిళలకు ప్రాధాన్యత, ప్రత్యేకంగా వారి భాగస్వామ్యాన్ని పెoపొందించడమే కాకుండా మహిళల పేరు మీద ఇల్లు,పథకాలు, భూమిఆస్తి హక్కులను కల్పిస్తోందని అన్నారు.మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. శ్రామిక మహిళలు, అసంఘటిత రంగం లో పనిచేస్తున్న మహిళల అభ్యున్నతికి, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండి పనిచేస్తుందని తెలియజేశారు.
నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ పి చిట్టిబాబు మాట్లాడుతూ శ్రామిక మహిళలైన గృహ కార్మికులకు ఈ ఎస్ ఐ పథకము వర్తింపచేయాలని, కనీస వేతనాలు పునరుద్ధరించాలని, పని ప్రదేశాలలో భద్రత కల్పించాలని, ఆర్థిక అభివృద్ధికి పరపతి సౌకర్యం కల్పించి మహిళా సాధికారతకు ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు
సీనియర్ న్యాయవాది వీ రత్నకుమారి మాట్లాడుతూ మహిళల కు అనేక చట్టాలు కల్పించబడ్డాయని అయినా అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయని ప్రతి మహిళ చట్టాలపై ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు ప్రజల సంస్థ ప్రతినిధి పి సుదీప మాట్లాడుతూ మహిళ అభివృద్ధి చెందిన రోజే దేశం అభివృద్ధి చెందుతుందని అందుకే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మహిళ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కోరుకొండ వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు సిహెచ్ స్వప్న, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు కే చాందిని, సియోధుల పార్వతి దళిత బహుజన శ్రామిక మహిళా కన్వీనర్ పేరు బండి సత్యవతి,రేజేటి సరస్వతి తదితరులు పాల్గొని ప్రసంగించగా వందలాది మంది మహిళలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
శ్రామిక మహిళల అభ్యున్నతిగా పనిచేస్తున్న వారిని ఈ సందర్భంగా సత్కరించారు. (Story: మహిళా సంక్షేమమే దేశ సౌభాగ్యం : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!