మహిళలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి
వనపర్తి (న్యూస్ తెలుగు) : ఏ సమాజం,ఏ జాతి,ఏ సంస్కృతి స్త్రీకి సముచిత స్థానం ఇస్తుందో ఆ సమాజం, ఆ జాతి ఆ సంస్కృతి అభివృద్ధి పథంలో వుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సింగిరెడ్డి వాసంతి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వాసంతి, నాగణమొని నాగమ్మ, నందిమల్ల శారద, ఉంగ్లమ్మ, అలేక్య తిరుమల మున్సిపల్ కార్మికులు, విశ్రాంత ఉపధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వాసంతి మాట్లాడుతూ స్త్రీలను అన్ని రంగాలలో ప్రోత్సహించిన దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు కదిలాయని అన్నారు.ప్రభుత్వాలు మహిళలకు స్వయం ప్రతిపత్తినీ కల్పించి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్బంగా మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎం.పద్మమ్మ, డి.బాగ్యమ్మ, విశ్రాంత ఉపాధ్యాయులు సింగమ్మ, భారతమ్మ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బి.అర్. యస్ మహిళా నాయకురాలు ఎన్.నాగమ్మ, నందిమల్ల శారద, కౌన్సిలర్ ఉంగ్లమ్మ్. అలేక్య తిరుమల్, సాయిలీల, కవిత, జయశ్రీ, నాయకులు నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, జోహెబ్, అణపటి రాము,తోట శ్రీను, సత్యం పాల్గొన్నారు. (Story: మహిళలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!