మహిళాసాధికారత కోసం పోరాటం: పి. కళావతమ్మ
వనపర్తి (న్యూస్ తెలుగు) : మహిళా సాధికారత కోసం పోరాటం కొన సాగించాలనిభారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మాజీ అధ్యక్షురాలు, కేతేపల్లి మాజీ సర్పంచ్ కళావతమ్మ, 2వ ఏఎన్ఎంల జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మహిళలకు పిలుపునిచ్చారు. వనపర్తి కార్యాలయంలో భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్.ఎఫ్.ఐ. డబ్ల్యు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇటీవల విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో స్టాఫ్ నర్స్ గా ఎంపికైన చిట్టెమ్మను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సమాజంలో పురుషునితో సమాన గౌరవం మహిళలకు దక్కటం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదన్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్న వివక్ష, దాడులు, అణచివేత జరుగుతోందన్నారు. మహిళలు బాలికలపై అత్యాచారాలు తగ్గటం లేదని, ప్రేమోన్మాదుల కత్తిపోట్లకు యువతుల బలి ఆగటం లేదన్నారు.కుటుంబంలో పిల్లల పెంపకంలో లోపమే ప్రధాన కారణమన్నారు. బిడ్డలను చక్కగా పెంచితే కొంతవరకైనా అకృత్యాలు తగ్గుతాయన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే కఠిన చట్టాలు వస్తాయన్నారు. ఏఐటియుసి జిల్లా కమిటీ సభ్యుడు రమేష్ పలువురు మాట్లాడారు. కృష్ణవేణి,అనసూయ, జయశ్రీ, సువర్ణ, అరుణ, అమృత, సుమిత్ర, చిట్టెమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని తీర్మానం
పేద మహిళల కుటుంబాలను చిద్రం చేస్తున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీర్మానం చేశారు. విచ్చలవిడిగా బెల్టు షాపుల ఏర్పాటు వల్ల కుటుంబ పెద్దలు తాగుడుకు బానిసై అనారోగ్యంతో మరణిస్తున్నారని, ఫలితంగా భార్యల తాళిబొట్లు తెగుతున్నాయని పేర్కొన్నారు. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించారని ఇంకా అమలు చేయలేదని, వెంటనే చర్యలు చేపట్టాలని తీర్మానంలో డిమాండ్ చేశారు.జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ తీర్మానం ప్రవేశపెట్టగా అందరూ చప్పట్లతో ఆమోదం తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేస్తామని ప్రకటించారు. (Story: మహిళాసాధికారత కోసం పోరాటం: పి. కళావతమ్మ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!