నామినేషన్ వేసే చివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదు
వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
వనపర్తి (న్యూస్ తెలుగు) : ఏప్రిల్, 1, 2024 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న యువత నామినేషన్ వేసే చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. కొత్త ఓటర్ల నమోదు, తుది ఓటరు జాబిత అనంతరం వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, ఫారం 6,7,8 ల పరిష్కారం, 1500 అంతకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్ ల నుండి మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై సలహాలు సూచనలు తీసుకోడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు నామినేషన్ వేసే చివరి రోజు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం తమవంతుగా అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఎపిక్ కార్డులు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందనీ తెలిపారు. వచ్చిన ఫారం 6,7,8 లను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. తుది ఓటరు జాబిత తర్వాత వచ్చిన ఫిర్యాదులను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందనీ ఇప్పటివరకు 79 డబుల్ ఓటర్లను గుర్తించడం జరిగిందన్నారు. వాటిని ఫారం-7 తీసుకొని తొలగించడం జరుగుతుంది. ఒకే పోలింగ్ స్టేషన్ లో 1500 అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వాటిని ఆగ్జిలరి పోలింగ్ స్టేషన్ గా మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వీపబగండ్ల, అయ్యవారిపల్లి, మియాపూర్, పాన్ గల్ మండలం నిజామాబాద్, వనపర్తి, చిట్యాల, నాగరాల, గోపాల్ పేట, తాడిపర్తి, పెబ్బెర్ మండలం రామమ్మపేట లలో అగ్జిలరి పోలింగ్ స్టేషన్ ల ఆవశ్యకతను గుర్తించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఎన్నికల కమిషన్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పల్సిందిగ కోరారు. ఎపిక్ కార్డులు సకాలంలో ఓటర్లకు అందేటట్లు చూడాలని ప్రజాప్రతినిధులు కలెక్టర్ ను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ వెనాచారీ, టిడిపి కే. శంకర్, సి.పి.యం మొహమ్మద్ జబ్బార్, బి.ఆర్.ఎస్ సయ్యద్ జమిల్, సి.పి ఐ రమేష్,బిజెపి నుండి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story: నామినేషన్ వేసే చివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదు)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!