ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి
వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్వేతా నగర్ లో గల బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల మండపాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ఆవిష్కరించారు. 88వ శివ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి వేడుకలు 15 రోజులపాటు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి పతాకాన్ని చిన్నారెడ్డి ఆవిష్కరించారు. బ్రహ్మకుమారీలు శోభ, నాగమణి లతోపాటు హాజరైన వారంతా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని శివ బాబా బోధనలను పాటించి సన్మార్గంలో నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి తనయుడు ఆదిత్య రెడ్డి, బి కృష్ణ, కిరణ్ కుమార్, ఐ సత్య రెడ్డి, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి శోభ కార్యక్రమం గురించి వివరిస్తూ శివరాత్రి జాగరణ ఉపవాసాల అర్థాన్ని తెలుసుకొని మసులుకోవాలన్నారు. అంధకారమైనటువంటి పాప కార్యాలను విడనాడి సత్కార్యాలు సదాలోచనలతో జాగరూకతతో మసలుకోవడమేనన్నారు. జి చిన్నారెడ్డి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని దేశ విదేశాలలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. భగవంతుని చూడాలని పట్టుదలతో హిమాలయాలనుకు వెళ్లి కఠోరమైన తపస్సు చేసి దర్శించుకున్న వారెందరో ఉన్నారన్నారు. అలాంటి శివబాబా 88వ జయంతి వేడుకలలో పాల్గొనడం తన అదృష్టం అన్నారు. స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంసతో తాను భగవంతుడిని చూడాలని అడిగినప్పుడు చూపించాడని చెబుతారన్నారు. ఈ మహాశివరాత్రి అందరు భక్తులతో జరుపుకోవాలని అన్ని రకాల సుఖ సంతోషాలు భగవంతుడు ప్రసాదించాలని, వనపర్తి ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కాంక్షించారు. (Story: ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!