భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ పై సిబిఐ విచారణ
సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్
వనపర్తి (న్యూస్ తెలుగు) : భూదాన్ భూముల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న బోర్డు మాజీ చైర్మన్ గుణ రాజేందర్ రెడ్డి పై సిబిఐ విచారణ చేయించాలని సర్వోదయమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం సర్వోదయం మండలి వనపర్తి జిల్లా మహాసభ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గిరి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూదాన్ బోర్డును రద్దు చేశారన్నారు. దాంతో భూదాన్ బోర్డు చైర్మన్ పదవి కూడా రద్దయిందన్నారు. కానీ ఇంకా గుణ రాజేందర్ రెడ్డి ఆఫీసు నడుపుతూ.. పాత తేదీలతో అనర్హులకు భూములను కేటాయిస్తూ ప్రొసీడింగులు ఇస్తున్నారని ఆరోపించారు. భూదాన్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,79,000 ఎకరాల భూదాన భూములు ఉన్నాయన్నారు. కొందరు భూస్వాములు, రాజకీయ నాయకులు భూమిని భూదానం ఇచ్చినట్లే ఇచ్చి, వారే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూదానము ఇచ్చిన కొంతభూమిని కొందరు పేద రైతులకు పంపిణీ చేసినప్పటికీ ఇతరుల ఆక్రమణకు గురైందన్నారు. మరికొంత భూదాన భూమి ఇప్పటికి పంచకుండా ఖాళీగా ఉందన్నారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, ఖాళీగా ఉన్న భూములను గుర్తించి అర్హులైన పేద రైతులకు, నిర్వాసితులకు పంపిణీ చేయాలన్నారు. వనపర్తి జిల్లాలోనూ భూదాన భూములు ఆక్రమణకు గురి అయ్యాయన్నారు. ప్రభుత్వం భూదాన భూములను పంపిణీ చేయకుంటే రైతులను సమీకరించి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గిరిప్రసాద్, నాయకులు కళావతమ్మ, శ్రీరామ్, రాబర్ట్, నిరంజన్, రమేష్, నరేష్, ఎండి ఖాదర్, రాజు, రమణ, శివ, శేఖర్ ,మహేష్, విశ్వేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన అధ్యక్షులుగా రమేష్
జిల్లా సర్వోదయ మండలి అధ్యక్షులుగా జె.రమేష్, ఉపాధ్యక్షులుగా కళావతమ్మ, ప్రధాన కార్యదర్శిగా రాబర్ట్, సహాయ కార్యదర్శిగా నిరంజన్, కోశాధికారిగా శివకుమార్, ప్రతినిధిగా శ్రీరామ్ లను 15 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. (Story: భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ పై సిబిఐ విచారణ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!