దిగ్విజయంగా ముగిసిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ
తిరుపతి (న్యూస్ తెలుగు) : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్. డి. ఉమాదేవి నిర్వహించిన వారం రోజుల సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. ఉమాదేవి మాట్లాడుతూ అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఎంతో అవసరమని, స్వీయ రక్షణ మెలకువలను నేర్చుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలమని, ఆత్మరక్షణ శిక్షణతోనే ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని అమ్మాయిలు రాటుదేలగలరని తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షకులుగా విచ్చేసిన ధనుంజయులు విద్యార్థులకు వారం రోజులపాటు కొన్ని ముఖ్యమైన టెక్నిక్ లను నేర్పించి ప్రాక్టీస్ చేయించారు. విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా, ఆత్మస్థైర్యాన్ని నింపుకొని స్వీయ రక్షణ మెలకువలతో ఆగంతకుల దాడులను ఎలా తిప్పి కొట్టి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్పించారు. అనంతరం మహిళా అధ్యయన కేంద్ర హెడ్ ఇన్చార్జ్ డాక్టర్ పి.నీరజ మాట్లాడుతూ ఆత్మరక్షణ శిక్షణ అనేది ఒక జీవన నైపుణ్యం, ఇది అమ్మాయిలు తమ పరిసరాలను గురించి మరింత అవగాహన కలిగి ఉంటూ, ఏ సమయంలోనైనా ఊహించకుండా జరిగే వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ ప్రాక్టీస్ వల్ల ప్రమాదాలనుండి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన కారణంగా ఎదురవుతున్న అనేక అనారోగ్య సమస్యల నుండి కూడా దూరంగా ఉండగలమని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇంకా కావాలని తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర రీసర్చ్ అసిస్టెంట్ డాక్టర్ ఎం.ఇంద్రాణి సహాయ సహకారాలు అందించారు. (Story: దిగ్విజయంగా ముగిసిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!