తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్ (న్యూస్ తెలుగు) : ప్రజాపక్షం సంపాదకులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కలిమెకొలన్ శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రెస్ అకాడమీ ఆవిర్భవించినప్పుడు ప్రప్రథమ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి సేవలందించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మీడయా అకాడమీగా పేరు మార్చిన తర్వాత ఆయన దానికి రెండవ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అల్లం నారాయణ ఈ ఛైర్మన్‌గా ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంశాలను ప్రాధాన్యతలోకి తీసుకున్న తర్వాత ఈ పదవికి శ్రీనివాస్‌రెడ్డి సరైన వ్యక్తి అని భావించి, ఆయనను మీడియా అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది. విశాలాంధ్ర రిపోర్టర్‌గా తన జర్నలిస్టు జీవితాన్ని ఆరంభించిన కే.శ్రీనివాస్‌రెడ్డి ఆ పత్రికలో ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన మన తెలంగాణ పత్రిక సంపాదకునిగా, ఆ తర్వాత ప్రజాపక్షం సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. జర్నలిస్టు నాయకునిగా ఆయన సుప్రసిద్ధుడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సుపరిచితుడు. ఐజేయూ అధ్యక్షునిగా, సెక్రటరీ జనరల్‌గా సుదీర్ఘకాలంపాటు సేవలందించారు. ఈరోజున జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు వంటి సదుపాయాలు వచ్చాయంటే ఆనాడు జర్నలిస్టు యూనియన్ నాయకునిగా ఆయన చేసిన ఉద్యమాలే కారణం. తెలంగాణలో గత పదేళ్లుగా జర్నలిస్టు సమస్యలు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అపరి ష్కృతంగా ఉండిపోయాయి. శ్రీనివాస్‌రెడ్డి నియామకంతో ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆశిస్తున్నారు. పాత్రికేయరంగంలో శ్రీనివాస్‌రెడ్డి చేసిన అపారమైన సేవలే ఆయనకు రెండుసార్లు ఈ అకాడమీ బాధ్యతలు చేపట్టే అవకాశం రావడానికి కారణంగా చెప్పవచ్చు. కే.శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండ జిల్లా పల్లెపహాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసి ఉన్నారు. జర్నలిస్టుగా ఆయన చేసిన పత్రికల్లో అనేక సంస్కరణలు చేపట్టి, కొత్తదనాన్ని తీసుకువచ్చారు. ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా కూడా పనిచేశారు. (Story: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి)
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!