Homeవార్తలుతెలంగాణఅంకిత భావానికి దక్కిన గౌరవం

అంకిత భావానికి దక్కిన గౌరవం

అంకిత భావానికి దక్కిన గౌరవం

మీడియా అకాడమీ ఛైర్మ‌న్‌గా శ్రీ‌నివాస్‌రెడ్డి నియామ‌కం ప‌ట్ల ఖ‌మ్మం ప్రెస్‌క్ల‌బ్‌లో సంబురాలు

ఖమ్మం (న్యూస్ తెలుగు) : మీడియా అకాడమీ ఛైర్మన్ పదవి కె.శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వడం ఐదు దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, వృత్తి నైపుణ్యానికి కృషి చేస్తున్న ఆయన అంకిత భావానికి దక్కిన గౌరవమని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. మీడియా అకాడమీ పూర్వపు ఆంధ్రప్రదేశ్ తొలి అధ్యక్షునిగా శ్రీనివాస్‌రెడ్డి పని చేశారని మరోసారి ఆయనకు గౌరవం దక్కడం పట్ల యావత్ జర్నలిస్టు సమాజల హర్షం వెలిబుచ్చుతుందని ఆయన అన్నారు. బజేయు జాతీయ అధ్యక్షులు, ప్రజాపక్షం సంపాదకులు కలిమెకొల‌న్‌ శ్రీనివాస్‌రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో టియుడబ్ల్యూజె (ఐజయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా రాంనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన శ్రీనివాసరెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేకమైన అవగాహన ఉన్నదని ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య వారధిగా పనిచేస్తూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు, రాష్ట్ర సమాచార ప్రచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రాంనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంజిల్లా జర్నలిస్టు సమాజం శ్రీనివాసరెడ్డికి ప్రతి సందర్భంలోను అండగా నిలిచిందని ఈ సందర్భంగా రాంనారాయణ గుర్తు చేశారు. హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, నైపుణ్య శిక్షణ తదితర విషయాలలో ఈ ప్రభుత్వం మరింత చేరువ కావాలని అందుకు ప్రెస్ అకాడమీ దోహదపడాలని రాంనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటిటి వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు ఎన్. వెంకట్రావు. ఖదీర్, నలజాల వెంకట్రావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్యులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, జిల్లా కోశాధికారి నాగండ్ల శివానంద, నగర కార్యదర్శి చెడుకుపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు వై. మాధవరావు, మోహినుద్దీన్, నామ పురుషోత్తం, మేడి రమేష్, కళ్యాణ్, కె. వెంకటేశ్వర్లు, గణేష్, సుధాకర్, సత్యనారాయణ, మధులత, డిపిఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (Story: అంకిత భావానికి దక్కిన గౌరవం)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!