తాగునీటి ఎద్దడిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
రూ.2.02 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధుల మంజూరు
వనపర్తి (న్యూస్ తెలుగు) : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో తాగునీటికీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని అందుకు కావలసిన తక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఆర్ డబ్ల్యుఎస్, మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కావలసిన నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ముందుగా 2కోట్ల 2లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను వెంటనే తయారుచేసి అమలు చేయాలన్నారు
బోరు బావులు తవ్వించుట, పాత సమస్యల పరిష్కారం, పలు మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు ఈ సమావేశంలో ఈఈ మేఘా రెడ్డి, ఖిల్లా ఘణపురం ఏఈ రవీందర్, పెద్దమందడి ఏఈ హరీష్ లు పాల్గొన్నారు. (Story: తాగునీటి ఎద్దడిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి)
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!