యడ్ల తాతాజీ దాతృత్వం
పాలకొల్లు (న్యూస్ తెలుగు) : ఇతరులకు సేవాదృక్పథం తో, చేసే సహాయం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, సహాయం చేసినప్పుడు వారి ముఖంలో కలిగే ఆనందం వెలకట్టలేనిదని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ అన్నారు. ఆదివారం పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని యాళ్లవానిగరువులో, మెండెల పుష్పలత అనే నిరుపేదకు నాలుగు చక్రాల తోపుడు బండిని తాతాజీ స్వయంగా అందజేశారు. పుష్పలత గత కొంతకాలంలో అద్దె బండి తీసుకుని జొన్నపొత్తుల వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఇటీవల ఆమె తనకు తోపుడు బండి ఇచ్చి సహాయం చేయాలని, ఇస్తే, అద్దె భారం తగ్గుతుందని తాతాజీని కోరడంతో, స్పందించిన తాతాజీ పుష్పలతకు తోపుడుబండిని తన సొంత ఖర్చులతో చేయించి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు కావలి శ్రీనివాసరావు, జోగి వెంకటేశ్వరరావు, నంబూరి శ్రీగంగా పవనకుమార్, మామిడి వెంకటేశ్వర రావు (బాబు), వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి కృష్ణాజీ, గంట నరేష్, వరంగల్ హనుమంతరావు, పాలపర్తి కృపనాద్, చెన్ను విజయ్, మండెల బుజ్జి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. (Story: యడ్ల తాతాజీ దాతృత్వం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!