మహిళ పట్ల అసభ్యకర దుర్భాషలు!
ఇంటిపై దాడి..ఆటో ధ్వంసం
తనను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళ
మొగల్తూరు (న్యూస్ తెలుగు): తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టి తనకు రక్షణ కల్పించాలని మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామం మోకావారిపాలెం గ్రామానికి చెందిన బాధితురాలు కుక్కల దుర్గాభవాని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె తెలిపిన కథనం ప్రకారం పేరుపాలెం పెద ఈడుగపాలెం గ్రామానికి చెందిన పూతునేని నరసింహస్వామి, కండిబోయిన శ్రీను, కండి బోయిన జయలక్ష్మి, కండి బోయిన ఝాన్సీ లక్ష్మి,20 మంది అనుచరులు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నా ఇంటి మీదకు వచ్చి నన్ను అసభ్యకరంగా దుర్భాషలాడి పెట్రోల్ పోసి తగలబెడితే అడిగే దిక్కు ఉండరని దాడి జరిపి నా ఇంట్లో సామాన్లను బయటపడేసి ఇల్లంతా ధ్వంసం చేశారని ఆవేదన తెలిపారు.
ఏ పరికరం పనికి రాకుండా చేసి దానిలో భాగంగా నా ఆటోను పడదోసి పూర్తిగా నాశనం చేశారని దుర్గ భవాని వాపోయారు. తనపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఈ ఘటనపై మొగల్తూరు పోలీసు వారికి ఫిర్యాదు చేసినట్లు ఆమె విలేకరులకు తెలిపారు. (Story: మహిళ పట్ల అసభ్యకర దుర్భాషలు!)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!