UA-35385725-1 UA-35385725-1

బీజేపీ దారెటు?

బీజేపీ దారెటు?

టీడీపీ, జనసేన సీట్ల ఖరారు

బాజ‌పా నేతల్లో పెరిగిన టెన్షన్‌

పొత్తు కోసం ఎదురు చూపు

అమరావతి-న్యూస్‌ తెలుగు: టీడీపీ, జనసేన పొత్తులతో సీట్లను ప్రకటించడంతో బీజేపీకి దిక్కుతోచడం లేదు. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా?, లేక పొత్తులకు ముందుకు వస్తుందా? అనేదీ తేల్చుకోలేకపోతోంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొందరు కీలక నేతలకు పొత్తు టెన్షన్‌ పట్టుకుంది. టీడీపీలో కీలకంగా పనిచేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ నాలుగేళ్ల క్రితం బీజేపీలో చేరారు. వారంతా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలంటే తప్పకుండా టీడీపీతో బీజేపీ పొత్తులో ఉండాలి. అదే జరగకుంటే వారి రాజకీయ భవిష్యత్‌ తారుమారవుతుంది. అందుకే బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారముంది. వారిద్దరికీ ఢిల్లీ కేంద్రంగా అనేక అవసరాలుంటాయి. కేసులు, వ్యాపార లావాదేవీల కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అండదండలు తప్పనిసరిగా కావాలన్న ప్రచారముంది. అందుకు వారు ఎంపీలుగా ఉండాల్సిన అవసరముంది. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాను చంద్రబాబు కలయికలో వారిద్దరితోపాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా కృషిచేశారు. అప్పటి నుంచి బీజేపీతో ప్రారంభమైన పొత్తుల సంప్రందింపులు, చర్చలు నేటి వరకూ కొనసాగుతున్నాయి. తాజాగా దిల్లీకి చంద్రబాబు వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ టీడీపీ-బీజేపీ పొత్తులపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి తమ పార్టీ నుంచి పొత్తుల్లో భాగంగా 20 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్యేలతో పోటీకి అవసరమైన స్థానాలను కేంద్రానికి పంపారు. కామినేని శ్రీనివాస్‌ గతంలో సుదీర్ఘకాలంపాటు టీడీపీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) ఆవిర్భావంతో ఆ పార్టీ తరపున కైకలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో ఆయన కైకలూరు నుంచి పోటీ చేసి గెలిచి, అనంతరం టీడీపీ ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కామినేని పనిచేశారు. కామినేని ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అక్కడ కైకలూరులో జనసేనకు టీడీపీ కేటాయిస్తే తక్షణమే ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే టీడీపీకి కేటాయిస్తే, బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఇవన్నీ లేకుండా పొత్తులు పొడిచి బీజేపీకే కైకలూరు సీటు కేటాయిస్తే ..బీజేపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. మూడు పార్టీల నుంచి ఆయనే అభ్యర్థిగా ఉన్నారు. దీని ఆధారంగా అటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలోని ముఖ్యనేతలతోనూ కామినేని సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారికి టీడీపీతో బీజేపీ పొత్తు చాలా అవసరంగా ఉంది.

రఘురామకు టిక్కెట్టు దక్కేనా ?

వైఎస్‌ఆర్‌సీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరి కూడా ఇదే తరహాగా ఉంది. తాజాగా ఆయన వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామాచేశారు. గతంలో నరసాపురం లోక్‌సభ నుంచి ఆయన ఎంపీగా వైసీపీ తరపున గెలిచారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన ఆర్నెళ్ల నుంచే ఆయన ఆధిష్టానంపై తిరుగుబాటుబావుటా ఎగురవేశారు. అప్పటి నుంచి ఆయనను పార్టీ పక్కన పెట్టింది. ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణంరాజు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరితే…నరసాపురం సీటు ఏ పార్టీకి వస్తే, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆయన బీజేపీలోగాని, జనసేనలోగాని, టీడీపీలోగాని ఇంతవరకు చేరలేదు. ఈయనపైనా అనేక కేసులున్నాయి. వాటితోపాటు ఈ ప్రభుత్వం హయాంలో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనకు కూడా పొత్తుల అవసరముంది. ఈ సమయంలో ఆయనకూ కేంద్రంలోను బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు కలవాలని కోరుకునే వారిలో రఘురామకృష్ణంరాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి చంద్రబాబు వెళ్లిన సమయంలో ఆయన స్వాగతం పలికి బీజేపీ నేతలను కలిపేలా చూస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ రఘురామకృష్ణంరాజు ముఖ్యపాత్ర పోషించినట్లు ప్రచారముంది. ఢిల్లీ నుంచి పేరొందిన సుప్రీంకోర్టు న్యాయవాదులను ఆయన ఏర్పాటు చేసి, చంద్రబాబు కేసులను బలంగా వదించేలా కృషి చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో ఆయనకు పూర్తి స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆయనకు మూడు పార్టీల నుంచి టిక్కెట్టు అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదు.

ఒంటరిగా పోటీ

బీజేపీతో టీడీపీ పొత్తు కుదరకపోతే, బీజేపీలోకి వెళ్లిన టీడీపీ నేతలంతా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారముంది. ఏపీలో బీజేపీకి 2014 ఎన్నికల్లో ఒక శాతం ఓటు బ్యాంకింగ్‌ మాత్రమే వచ్చింది. దీని ఆధారంగా బీజేపీ ఒంటరిగా బరిలో దిగితే ఒక్క అసెంబ్లీ, ఎంపీ సీటు సాధించే పరిస్థితుల్లేవు. అదే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పొత్తులతో ముందుకెళ్తే, బీజేపీకి ఓట్లు, సీట్లతోపాటు పవర్‌ షేరింగ్‌ వచ్చే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ బీజేపీ నాయకత్వం ఆధిష్టానంతో పొత్తులపై సంప్రదింపులు చేస్తోంది. అలా కుదరకుంటే ఒంటరిగానే బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. పొత్తులు కుదరకుంటే, గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారంతా, తిరిగి ఒక్కసారిగా టీడీపీలోకి వచ్చే పరిస్థితులున్నాయి. ఆ సమయంలో బీజేపీని బలహీన పరిచామన్న సంకేతాలను వారు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. దీనిపై టీడీపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. చంద్రబాబుపై ఉన్న కేసులతోపాటు బీజేపీతో పొత్తు వల్ల వచ్చే అనర్థాలపైన ఆందోళన ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే, టీడీపీలో ఉన్న కాస్త మైనార్టీ ఓటింగ్‌ దూరమయ్యే ప్రమాదముంది. బీజేపీతో పొత్తు కుదిరితే అంతా మంచిగా ఉంటుంది. పొత్తు పొడవకుంటే వెంటనే బీజేపీ నుంచి టీడీపీలోకి కొందరు ముఖ్యనేతలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేదీ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. (Story: బీజేపీ దారెటు?)

See Also:

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1