‘పుత్రులకు’ ఓటమి ఫీవర్!
లోకేష్, పవన్ అయోమయం
అసెంబ్లీలో అడుగెట్టేనా ?
వెంటాడుతున్న 2019 ఫలితం
నియోజకవర్గాల అన్వేషణ
చంద్రబాబుకు ‘కుప్పం’ భయం
అమరావతి-న్యూస్ తెలుగు: చంద్రబాబుకు ఒకరు పుత్రుడు..మరొకరు దత్త పుత్రుడు. ఇది వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నిత్యం వాడుతున్న భాష. గత ఎన్నికల ఓటమి టీడీపీ నేత నారా లోకేష్‌ను, జనసేన నాయకడు పవన్ కళ్యాణ్‌ను వెంటాడుతున్నాయి. మళ్లీ గెలుస్తామా? లేదా? అనే ఫీవర్ వారికి పట్టుకుంది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి దిగి ఓటమి చెందారు. చంద్రబాబుకు వారిద్దరిని గెలిపించడం తలకు మించిన భారంగా మారింది. ఇదే సమయంలో కుప్పం నుంచి అనేక సార్లు గెలిచిన చంద్రబాబుకూ ఇప్పుడు ఓటమి ఫీవర్ పట్టుకుంది. తాజాగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ సారి చంద్రబాబుకు విశ్రాంతి ఇద్దామని, నేను బరిలో దిగుతానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చానీయాంశమయ్యాయి. దీంతో కుప్పం నుంచి చంద్రబాబు వైదొలగి, మరో స్థానాన్ని ఎంచుకుంటారన్న ప్రచారముంది. అదే సమయంలో కుప్పం నుంచి భువనేశ్వరిని బరిలో దించుతారని సమాచారం. ఇదే జరిగితే చంద్రబాబు నైతికంగా ఓడిపోయినట్లుగానే అధికార వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారానికి దిగుతుంది. చంద్రబాబు నియోజకవర్గం మారితే ఆ ప్రభావం పార్టీపైనా పడుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, సీఎం జగన్ కడపజిల్లా పులివెందుల నుంచి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. జగన్ కేవలం ఎన్నికల సమయంలో నామినేషన్ వేసి వస్తారు. పులివెందులలో ప్రత్యేకంగా ప్రచారం చేయరు. అదే చంద్రబాబు మాత్రం ఇటీవల కాలంలో తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అనేక సార్లు పర్యటించారు. ఆమె సతీమణిని పంపుతున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందారు. కుప్పం మున్సిపాల్టీని సైతం వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ కూడా తగ్గిపోయింది. ఇవి చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. ఇటీవల అనంతపురంజిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు లక్షలాదిగా వైఎస్‌ఆర్‌సీపీ కేడర్ తరలివచ్చింది. ఈ సిద్ధం సభ తర్వాత ఆ పార్టీలో చేరికలు భారీగా పెరిగాయి. రాయలసీమ మూడు జిల్లాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఆయన కుప్పం నియోజకవర్గంపై దృష్టిపెట్టి, చంద్రబాబును ఓడిరచాలన్న లక్ష్యంతో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ 175కి 175 సీట్లు అనే నినాదాన్ని కుప్పం నుంచే ప్రారంభించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చుకుంటారా?, లేక కుప్పం నుంచే బరిలోకి దిగుతారా? అనేదీ సందిగ్ధంగా మారింది.
ఎట్టకేలకు భీమవరం బరిలో పవన్
జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అచితూచి ఎట్టకేలకు గతంలో ఓటమి పాలైన భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఒక్క భీమవరం నుంచే ఆయన పోటీ చేస్తారా?, లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? పొత్తుల్లో వచ్చే సీట్ల ఆధారంగా తేలాల్సి ఉంది.త్వరలో టీడీపీ, జనసేన కలిసి తాడేపల్లిగూడెం కేంద్రంగా భారీ సభను నిర్వహించనుంది. తాడేపల్లిగూడెం నుంచి రెండో సీటుగా అసెంబ్లీకి పవన్ పోటీ చేస్తారని సమాచారం. లేదా తిరుపతి నుంచి పోటీకి దిగే అవకాశాలున్నాయి. టీడీపీ, జనసే, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇంతవరకు సీట్ల విభజన కొలిక్కిరాలేదు. అసలు పొత్తులు పొడిచేవరకూ గ్యారెంటీ లేదు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తును ఆశిస్తోంది. దానికి కారణం చంద్రబాబుపై ఉన్న కేసులు వెంటాడుతున్నాయి. బీజేపీని వదిలి చంద్రబాబు ఇండియా కూటమితో జతకడితే వెంటనే ఆయనపై కొత్త కేసులు పుట్టుకురావడం, బెయిల్ రద్దవుతుందన్న ఆందోళన ఆయనలో కన్పిస్తోంది. ఇవన్నీ బయటకు చెప్పకపోయినా, దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తుందన్న సాకుతో బీజేపీతో జతకట్టేందుకు టీడీపీ, జనసేన సిద్ధమయ్యాయి. ఎవరితో జతకట్టినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాము సిద్ధం అంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ సవాల్ విసరడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మూడు పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాల్సిన పరిస్థితి చంద్రబాబు, పవన్‌కు పట్టింది. అలా లేకుంటే 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లేందుకు ఆయనకు గత ఓటమి వెంటాడుతోంది. దాంతోనే ఎలాగైనా పొత్తులతోనే పోటీకి దిగాలని పవన్ భీష్మించుకుని కూర్చున్నారు. ఎన్నికల నాటికి పవన్ పోటీ చేసే స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను బలమైన వారిని దించుతుందన్న ఆందోళన ఆయనలో ఉంది. దీంతో ముందుగా భీమవరాన్ని ఎంచుకోగా, రెండో సీటుపై పవన్ కసరత్తు చేస్తున్నారు.
మంగళగిరిలో లోకేష్‌కు ఎదురుదెబ్బ
వైఎస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి సొంత పార్టీలోకి రావడంతో లోకేష్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వైఎస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఇన్‌చార్జి మార్పుతో కలతచెందిన ఆర్కే కాంగ్రెస్‌లో చేరారు. ఆర్కే పార్టీని వీడితే తనకు కొంతవరకు కలిసి వస్తుందని లోకేష్ భావించారు. ఆ దిశగా మంగళగిరిలో పర్యటనలు చేశారు.అనంతరం ఆర్కే తిరిగి పార్టీలోకి చేరడంతో మంగళగిరి వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో జోష్ ఏర్పడిరది. టీడీపీ శ్రేణులు మాత్రం నిరాశ చెందారు. ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచి లోకేశ్ గెలవడం అంత సులువు కాదు. మంగళగిరిలో అత్యధికంగా బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. దీనిని గుర్తించిన వైఎస్‌ఆర్‌సీపీ అదే సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలో దింపనుంది. దానికితోడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు వైఎస్‌ఆర్‌సీపీకి అత్యధికంగా పడతాయి. లోకేష్‌కు గత ఎన్నికల ఓటమి వెంటాడుతోంది. మంగళగిరి నుంచి వేరే నియోజకవర్గానికి మారేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారముంది. మొత్తంగా చంద్రబాబు తిరిగి టీడీపీని అధికారంలోకి తేవడం, ఆయన కుప్పంలో గెలవడం సవాల్‌గా మారింది. దీనికితోడు తన పుత్రుడు లోకేష్‌ను, దత్తపుత్రుడు పవన్‌ను గెలిపించడం పెద్ద భారమైంది. (Story: ‘పుత్రులకు’ ఓటమి ఫీవర్!)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!