UA-35385725-1 UA-35385725-1

సంకోచంలో ‘షర్మిలక్క’

సంకోచంలో ‘షర్మిలక్క’

‘వైఎస్‌’ పేరు జపం

‘ఆంధ్రా రెడ్డి’ల రాం..రాం..

జగనే వారసుడిగా నమ్మకం

కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే ఆర్కే బై బై

అమరావతి-న్యూస్‌ తెలుగు:

షర్మిల అక్కకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె అష్టకష్టాలు పడి తెలంగాణ నుంచి ఏపీలో రాజకీయ అరంగ్రేటం చేసినా ప్రజల స్పందన ఆశా జనకంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ బాధ్యతలు స్వీకరించిన షర్మిలకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నాడు తన అన్న వదిలన బాణమంటూ ఇదే కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన షర్మిల..ఇవాళ అదే కాంగ్రెస్‌ గూటికి చేరడంతో ప్రతికూల పరిస్థితులున్నాయి. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన రోజే, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆమె సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించడంపై ఆయన అసంతృప్తితో, షర్మిల నేతృత్వాన కాంగ్రెస్‌లోకి చేరారు. చేరిన నెల రోజుల్లోనే షర్మిల నడవడికను ఆయన గమనించి, పార్టీకి దూరమయ్యారు. తాజాగా సీఎం జగన్‌ సమక్షంలో తిరిగి వైసీపీకి చేరారు. ఆర్కే కేవలం షర్మిలను చూసే కాంగ్రెస్‌లో చేరారేగానీ, కాంగ్రెస్‌ను చూసి మాత్రం కాదు. అందుకే ఈ పరిణామాలు షర్మిలక పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. షర్మిల వ్యవహారశైలిపై ఏపీ కాంగ్రెస్‌ నేతలు విస్తుపోతున్నట్లుగా ప్రచారముంది. ఆమె నవడిక, దూకుడు, పరుష పదజాలం కాంగ్రెస్‌కు లబ్ది కంటే, నష్టాన్నే చేకూరుస్తాయన్న ఆందోళనతో కాంగ్రెస్‌ సీనియర్లు ఉన్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌ టీపీ)ని తెలంగాణలో ఆమె నడపలేక చేతులెత్తేశారు. తెలంగాణలోనూ ఇదే తరహాగా పరుష పదజాలంతో షర్మిల వ్యవహరించడం, సొంత పార్టీ నేతలకు గౌరవం ఇవ్వకపోడం ఇవన్నీ ఆమెకు నష్టం చేకూర్చాయి. దానికితోడు తెలంగాణలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ఆమెకు దగ్గరవ్వకపోవడం పార్టీ పతనానికి దారితీశాయి. ఏపీలో షర్మిల కాంగ్రెస్‌ బలోపేతానికి వస్తే దానిని ఆ పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు స్వాగతించవచ్చు. ఆమె మాత్రం వైసీపీ ఓట్లు కొంత చీల్చి, టీడీపీకి పరోక్షంగా సహకరించాలన్న వ్యూహంతో ఉందన్న ప్రచారముంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నోటా కంటే ఓట్ల శాతం తక్కువుగా వచ్చాయి. ఇప్పుడు షర్మిల వల్ల పెద్దగా ఓట్ల శాతం పెరగబోదు. అందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాడు కాంగ్రెస్‌ విభజించడమే. ఆ విభజనను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇంకా మరువలేదు. పదేళ్లులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఇప్పుడు ఆంధ్రాలోనూ మరోసారి కాంగ్రెస్‌కు చావుదెబ్బ ఖాయంగా రాజకీయ పరిణామాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగితే ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటును గెలుపొందే అవకాశాలు లేవు. ఇదంతా తెలిసీ… కాంగ్రెస్‌లోకి షర్మిల రావడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. దానికి కారణం పరోక్షంగా చంద్రబాబుతో ఒప్పందమనే ప్రచారముంది. దీనిని పసిగట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తక్షణమే ఆ పార్టీకి దూరమయ్యాయి. ఇటీవల వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్‌ గూటికి చేరతారన్న ప్రచారం ఉండగా,ఏ ఒక్కరూ వెళ్లలేదు. చేరిన ఒక్క ఎమ్మెల్యే ఆర్కే వెనక్కి రావడంతో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌కు ఇది అతి పెద్ద నష్టంగా భావించవచ్చు.

‘వైఎస్‌’ షర్మిలా ‘రెడ్డి’ పేరు ఫలించేనా ?

షర్మిల తన పేరులో వైఎస్‌ షర్మిలా రెడ్డి అనేదీ నొక్కిచెబుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నా, స్పందన రావడం లేదు. ఆమె ప్రతిసారీ రాజన్న బిడ్డను అని చెబుతున్నా వైఎస్‌ఆర్‌ అభిమానులెవ్వరూ ఇంతవరకూ కాంగ్రెస్‌ గూటికి చేరలేదు. రెడ్ది సామాజికవర్గం పూర్తిగా షర్మిలను దూరంగా ఉంది. వైఎస్‌ వారసుడు జగనే అనే నినాదాన్ని వారు ప్రత్యక్షంగా సంకేతాలిస్తున్నారు. తెలంగాణలోని రెడ్లు కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలో ఉండగా, షర్మిల పార్టీలోకి ఏ ఒక్క ప్రధాన నేతా చేరలేదు. ఇదే పరిస్థితి ఆంధ్రాలోనూ కన్పిస్తోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అసలైన పార్టీ కాంగ్రెస్సేనని ఆమె ప్రజల్లోకి చెప్పేందుకు ప్రయత్నించినా, ఆయన ఇంటిపేరును ఉపయోగించినా ఫలతం లేదు. ఒక వైపు కాంగ్రెస్‌పైన ఉన్న ఆగ్రహాన్ని ఇంతవరకు రాష్ట్ర ప్రజలు మరువలేకపోయారు. అదే కాంగ్రెస్‌ గతంలో జగన్‌ను జైలుకు పంపడం, ఆ తర్వాత షర్మిల ద్వారా కుటుంబాన్ని చీల్చిందన్న ఆవేశంతో వైఎస్‌ఆర్‌ అభిమానులున్నారు. కాంగ్రెస్‌లోకి షర్మిల వచ్చాక, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలెవ్వరూ ఆమెకు తోడుగా నిలవకపోవడమే ఇందుకు నిదర్శనం. పైపెచ్చూ షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్‌పై సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా దుమ్మెతిపోస్తున్నారు. వారి వివాహాల నుంచి వ్యక్తిగత జీవితాలపైనా ఎండగడుతున్నారు. ఇందులో వైసీపీ అభిమానులు, వైసీపీ ముసుగులో ఐటీడీపీ వారూ ఉన్నారన్న ప్రచారముంది. షర్మిల ఏదైతో ఆశయంతో వచ్చిందో, అది కనుచూపు మేరలో కన్పించడం లేదు. ఆమె కుమార్డు వివాహానికి సైతం ఒక్క విజయమ్మ మినహా, వైఎస్‌ కుటుంబ సభ్యులు ఎవ్వరూ వెళ్లలేదు. ఎన్నికలకు ఇంకా రెండు నెలలోపే సమయముంది. ఈలోగా కాంగ్రెస్‌ ఓటింగ్‌ను ఆమె ఎంత శాతం పెంచుతుందనేదీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.

షర్మిలతో వైసీపీకే మేలు ?

వైసీపీ తరపున విశ్లేషకుల మాటలు గమనిస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్‌ ఎంత చీలితే…అది వైసీపీకి లాభమని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిత్యం తాము ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే పొత్తులకు దిగామని పట్టుపట్టి ఉన్నారు. ఆయన మాటల ఆధారంగానే చూస్తే టీడీపీ, జనసే, బీజేపీలు పొత్తులకు దిగి ఒక కూటమిగా మారితే, రెండో కూటమిగా కాంగ్రెస్‌, వామపక్షాలు, మరో వైపు వైసీపీ ఉంటే…ఈ మూడు కూటములతో ఎన్నికలు జరిగే అవకాశముంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒక్క టీడీపీ కూటమికే పూర్తిగా వెళ్లవు. కాంగ్రెస్‌ కూటమికీ ఎంతోకొంత వెళ్తాయి.అప్పుడు కాంగ్రెస్‌ కూటమి ఓటింగ్‌ గతం కంటే కొద్దిగాపెరిగినా, అది టీడీపీకే నష్టం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్‌ కూటమి చీల్చినట్లవుతుంది. ఈ లాజిక్‌ను పవన్‌ కల్యాణ్‌ మరచినట్లు ఉన్నారు. కాంగ్రెస్‌ కూటమి కట్టినా, షర్మిల ద్వారా వ్యక్తిగతంగా ప్రభుత్వ ఓటింగ్‌ కొంతవరకైనా చీల్చినా వెరసి వైసీపీకే లాభంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాగైనా సీఎం జగన్‌ను ఓడించాలన్న లక్ష్యంతో ఏపీకి వచ్చిన షర్మిల లక్ష్యం నెరవేరుతుందా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. (Story: సంకోచంలో ‘షర్మిలక్క’)

See Also: 

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1