Google search engine
Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీసూర్య కళాశాలలో ఘనంగా ఫేర్‌వెల్‌ పార్టీ

శ్రీసూర్య కళాశాలలో ఘనంగా ఫేర్‌వెల్‌ పార్టీ

శ్రీసూర్య కళాశాలలో ఘనంగా ఫేర్‌వెల్‌ పార్టీ

నర్సాపురం (న్యూస్ తెలుగు) : శ్రీసూర్య జూనియర్ కళాశాలలో 2022-24 విద్యా సంవత్సర ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసాపురం తులసి హాస్పిటల్ డాక్టర్ బళ్ల మురళీ , విశిష్ట అతిథిగా ప్రముఖ మోటివేటర్, వాలిస్ లైఫ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ &సీఈఓ రామ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఘంటసాల సూర్యనారాయణ విచ్చేశారు. కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ
అధ్యక్షతవహించారు.ముఖ్యఅతిథి డాక్టర్ బళ్ల మురళీ మాట్లాడుతూ ప్రతి పనిలోనూ ప్రయత్న లోపం లేకుండా పట్టుదలతో ముందుకు నడిస్తే విజయం తానుగా సొంతమవుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా జీవితాన్ని మలుచుకోవాలని సూచించారు.
విశిష్ట అతిధి
శ్రీరామ్ మాట్లాడుతూ వర్షం చినుకు కాలిన ఇనుము మీద పడితే ఆవిరైపోతుందని, తామరాకు మీద పడితే మెరుస్తుందని, కొన్ని చినుకులు సముద్రంలోని ఉప్పు నీటిలో చొచ్చుకొని పోయి ఆల్చిప్పలో పడి ముత్యంగా మారతాయని, విద్యార్థి ఏ చినుకుగా ఉంటాడో ఈ దశలోనే నిర్ణయించుకోవాలన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.
కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ మాట్లాడుతూ డాక్టర్ బళ్ల మురళీ ఆ రోజుల్లోనే ఉత్తమ ప్రతిభతో మెడిసిన్ లో మంచి ర్యాంకు సంపాదించి స్వయంకృషితో పట్టుదలతో మంచి ప్రతిభను కనబరుస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.
శ్రీసూర్య కళాశాల అభ్యున్నతికి అధ్యాపకులే కారణమని, కళాశాల స్థాపించిన దగ్గర్నుంచి ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రంగాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారని తెలిపారు. విద్యార్థులు సమాజసేవ మానవతా విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి.
2024 జేఈఈ ఫేజ్ -1 మంచి పర్సంటేల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఘంటసాల బ్రహ్మాజీ, అతిధుల చేతుల మీదుగా పుష్పగుచ్చాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ అడ్వైజర్ బి. రామచంద్రారెడ్డి , సీనియర్ అధ్యాపకులు ఫాజిల్ ,
డాక్టర్ జానకిరామ్ , కె.త్రిమూర్తులు , ఎం శ్రీనివాస్ , వేణుగోపాల్ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యు. లక్ష్మీకాంత్ , డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి. పుల్లారావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story: శ్రీసూర్య కళాశాలలో ఘనంగా ఫేర్‌వెల్‌ పార్టీ)

See Also: 

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!