ఆనందంతోనే ఆయుష్షు: చిన్నం రామకోటయ్య
చాట్రాయి (న్యూస్ తెలుగు): మనిషిలో సంతోషమే సగం బలం నింపుతుందని, ఆనందం ఆయుష్షును పెంచుతుందని, వయోభారం పైబడిన వారికి మానసిక ఉల్లాసం చాలా అవసరమని నూజివీడు మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య తెలిపారు. ఆదివారం చాట్రాయి మండలం బూరుగగూడెం గ్రామంలో చిన్నం రామకోటయ్య తండ్రిగారైన కీర్తిశేషులు చిన్నం సుబ్బారావు పేరు మీద వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ పాత్రికేయులు నెల్లూరు కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో వయోభారం పైబడిన తల్లిదండ్రుల పట్ల కొంత నిర్లక్ష్యం జరుగుతుందన్నారు. కుటుంబ వ్యవస్థ పూర్వంతో పోల్చుకుంటే వివిధ రూపాలలో మార్పు చెందిందన్నారు. వృద్ధులకు సంతోషంగా ఉంటే సగం బలాన్ని ఇస్తుందని, ఆనందం ప్రతి మనిషిలో ఆయుష్షుని పెంచుతుందని, అందుకే ప్రతి ఒక్కరికి మానసికమైన ఉల్లాసం అవసరం ఉందన్నారు. చాట్రాయి మండల పరిధిలో గల 18 గ్రామ పంచాయతీల పరిధిలో కుల మతాలకు అతీతంగా వయోభారం పైబడిన వారు ఎవరైనా ఆశ్రమం నియమ నిబంధనలకు లోబడి ఇక్కడ ఉండవచ్చు అని అన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంచలంచెలుగా పెంచుకుంటూ వెళతామన్నారు. కార్యక్రమంలో చాట్రాయి మాజీ సర్పంచ్ జోషి చాట్రాయి వర్తక సంఘం నాయకులు గోళ్ళ మోహన్ రావు వీసం నరసింహారావు, సీనియర్ నాయకులు రతి కంటి రామచంద్రరావు, చీపురుగూడెం మాజీ ఎంపీటీసీ మేకల చందు, కొమ్ము సృజనరావు నరసింహరావు, పాలెం మాజీ ఎంపిటిసి సుబ్బారెడ్డి చనుబండ, నాయకులు ములగలపాటి శ్రీనివాసరావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు చాట్రాతి రమాకాంత్ బెనర్జీ, చంద్ర శేఖర్ రెడ్డి, కారంగుల చిన్నబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. (Story: ఆనందంతోనే ఆయుష్షు: చిన్నం రామకోటయ్య)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!