కంటతడి పెట్టిన ముద్దరబోయిన!
చాట్రాయి (న్యూస్ తెలుగు) : తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆత్మీయ సమావేశంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. పదేళ్లుగా నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పటికీ రెండుసార్లు ఓడిపోయిన బీసీ సామాజిక తరగతికి చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావును కాదని అదే సామాజిక తరగతికి చెందిన పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని టిడిపి నూజివీడు అభ్యర్థిగా నిర్ణయించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుని కలిసి వచ్చిన టిడిపి నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు శనివారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికై చేసిన పనులను గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో సాక్షాత్తు చంద్రబాబు తనను అభినందించారన్నారు. తూర్పుగోదావరి పర్యటనలో తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు తదితరులతో కలిసి వెళ్లి బస్సులో మాట్లాడినప్పుడు కూడా సీటు తనదేనని చెప్పారని…. చంద్రబాబు నూజివీడు వచ్చిన సందర్భంలో సభలో కూడా మన కాబోయే ఎమ్మెల్యే ముద్రబోయిన అంటూ మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు చూస్తే అనివార్య కారణాల వలన వేరే వారికి ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారని, కనీసం నియోజకవర్గంలో ఏ నాయకుడితో సంప్రదించి మార్చుతున్నారని ప్రశ్నించారు. స్థానిక నాయకులకు కార్యకర్తలకు తెలియకుండా తాను ఏమి చేయలేదన్నారు. నేను చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. నేను పార్టీని ఏనాడు అమ్ముకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా తాను పయనిస్తానన్నారు. (Story: కంటతడి పెట్టిన ముద్దరబోయిన!)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2